Begin typing your search above and press return to search.

త‌నపై బ‌యోపిక్ అంటేనే భ‌య‌ప‌డుత‌న్న గ్లోబ‌ల్ స్టార్?

By:  Tupaki Desk   |   21 July 2021 12:30 AM GMT
త‌నపై బ‌యోపిక్ అంటేనే భ‌య‌ప‌డుత‌న్న గ్లోబ‌ల్ స్టార్?
X
బ‌యోపిక్ ల ట్రెండ్ లో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ అదే చ‌ర్చ‌! ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో చాలా బ‌యోపిక్ లు తెర‌కెక్కి విజ‌యం సాధించాయి. వేరొక‌రి బ‌యోపిక్ లో న‌టించేందుకు ఆస‌క్తిగానే ఉండే పీసీ త‌న బ‌యోపిక్ తీస్తానంటే మాత్రం వ‌ద్దు బాబోయ్! అనేస్తోంది. గతంలో ఈ బ్యూటీ లేడీ బాక్స‌ర్ మేరీ కోమ్ బ‌యోపిక్ లో టైటిల్ పాత్రను పోషించిన సంగ‌తి తెలిసిన‌దే. ప్రస్తుతం ఓషో వ్యక్తిగత కార్యదర్శి మా ఆనంద్ షీలా బయోపిక్ లో ప్రియాంక చోప్రా నటిస్తోంది.

కానీ త‌న బ‌యోపిక్ తీస్తానంటే మాత్రం స‌సేమిరా అనేస్తోంది. తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడే బ‌యోపిక్ వ‌ద్దే వ‌ద్దు అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ర‌చ‌యిత‌ల‌కు సూచించింది.

నిజానికి ప్రియాంక చోప్రా జీవిత‌ ప్రయాణం చాలా స‌రంజామా ఉంది. ఎన్నో ట్విస్టులు ట‌ర్నులు ఉన్నాయి. నిర్మాత‌లు త‌న‌ని వేధించ‌డం మొద‌లు త‌న జీవితంతో ఆడుకున్న నిశాచ‌రుల జాబితా పెద్ద‌దే ఉంది. అలాగే గ్లోబ‌ల్ స్టార్ గా ఎదుగుతున్న తాను అనూహ్యంగా అమెరికా కోడ‌లు అవ్వ‌డం కూడా పెద్ద ట్విస్ట్. వీట‌న్నిటినీ మించిన ట్విస్టులు త‌న జీవితంలో ఇంకా ఎన్నో ఎన్నో.

మిస్ వ‌ర‌ల్డ్ అయిన త‌న‌ను స‌ర్జ‌రీలు చేయించుకోవాల‌ని పిరుదులు స‌రి చేయించుకోవాల‌ని స‌ల‌హాలిచ్చిన మ‌హానుభావులు ఇండ‌స్ట్రీలో ఉన్నారు. మ‌రి ఇవ‌న్నీ తెర‌పై చూపిస్తే రంజుగానే వ‌ర్క‌వుట‌వుతాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. వీట‌న్నిటితో పాటు అసాధార‌ణ విజ‌యాల‌తో బాలీవుడ్ టు టాలీవుడ్ పీసీ ఎదిగిన తీరు నిరంత‌రం వార్త‌ల్లో ఉంది. ఎంద‌రికో స్ఫూర్తినిచ్చే జీవితం త‌న‌ది.. ఆ ఎలిమెంట్ ని ర‌స‌వ‌త్త‌రంగా చూపించే ప‌నిత‌నం ద‌ర్శ‌కుల‌కు ఉండాలి.

పీసీ చాలా మంది నటులకు స్ఫూర్తి. హాలీవుడ్ లో తనకంటూ ఒక రేంజుంది. ఆ స్థాయి ఉన్న‌ ఏకైక భారతీయ నటి ఆమె మాత్రమే. సినిమా నేపథ్యం లేకుండా ప్రియాంక ప్రతిదీ సాధించారు. ఔట్ సైడ‌ర్ గా ఇండ‌స్ట్రీని ఏలారు. ఆమె కెరీర్ ఒక పెద్ద పాఠ్య‌పుస్త‌కం.. ఉత్సాహంగా చ‌దివించే నావెల్టీ ఉన్న పుస్త‌కం అంటే అతిశ‌యోక్తి కాదు.

కానీ తాను ఇంకా త‌న‌పై బ‌యోపిక్ తీసే దశకు తాను చేరుకోలేదని ఆమె అన్నారు. త‌న భ‌ర్త‌తో అరుదైన క్ష‌ణాల‌కు సంబంధించి వివాహ వార్షికోత్వం గురించి పీసీ చాలా విష‌యాల్ని ముచ్చ‌టించారు. ప్రియాంక ప్రస్తుతం మ్యాట్రిక్స్ 4 .. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ సిటాడెల్ చిత్రంలో నటిస్తోంది. ప్రియాంక ప్రస్తుతం త‌న త‌దుప‌రి వెబ్ సిరీస్ సిటాడెల్ చిత్రీకరణ కోసం లండ‌న్ లో ఉంది. ఇది రస్సో బ్రదర్స్ నిర్మిస్తున్న సిరీస్. ది మ్యాట్రిక్స్ 4- టెక్స్ట్ ఫర్ యు- మిండీ కాలింగ్ స‌హా ఒక రోమ్-కామ్ లోనూ చేస్తోంది.

నిక్ తో రియాలిటీ షోలను చేసేందుకు పీసీ స‌న్నాహ‌కాల్లో ఉంది. మ‌రోవైపు ఓ ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో పీసీ ప‌లు వెబ్ షోలు సిరీస్ లు నిర్మించేందుకు భారీ ఒప్పందం చేసుకుంది. ఈ సిరీస్ లు షోలు భార‌తీయ భాష‌ల్లోనూ విడుద‌ల కానున్నాయ‌ని ఇంత‌కుముందు వెల్లడించారు. ఓవ‌రాల్ గా పీసీ స్టార్ హీరోయిన్ గా హ‌వా సాగిస్తూనే మ‌రోవైపు ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని ర‌న్ చేస్తూ సాటి స్టార్ల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పీసీ భ‌విష్య‌త్ లో అత్యంత క్రేజీ ఎంట‌ర్ ప్రెన్యూర్ గానూ స‌త్తా చాట‌నుంది. ఇక గ్లోబ‌ల్ వేదిక‌ల‌పై త‌న‌కు ద‌క్కుతున్న గౌర‌వం పైనా నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది.