Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ అంటే ఆమెకు ఒణుకు

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:18 AM GMT
ఆ డైరెక్ట‌ర్ అంటే ఆమెకు ఒణుకు
X
త‌న‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడిగా అత‌డంటే ఆ సీనియ‌ర్ క‌థానాయిక‌కు ఎంతో అభిమానం. అంత‌కుమించిన‌ గౌర‌వం. ఆయ‌న అడ‌గాలే కానీ ఎన్ని కాల్షీట్లు అయినా కాద‌న‌కుండా ఇచ్చేస్తుంది. గురువు అన్న గౌర‌వంతో అత‌డికి ఇన్నేళ్ల త‌ర్వాత కూడా వ‌రుస‌గా సినిమాలు తీసేందుకు కాల్షీట్లు ఇచ్చింది. అగ్ర క‌థానాయిక హోదాలో ఒక ఫ్లాప్ ద‌ర్శ‌కుడికి క‌మిట‌వ్వాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా .. అత‌డిపై ఉన్న గౌర‌వం.. ప్రేమాభిమానాల వ‌ల్ల‌నే అలా క‌మిటైంద‌ట‌. కానీ ఏం లాభం?

అలా ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో స‌ద‌రు ద‌ర్శ‌కుడు అంతే దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఒక‌వేళ ఈ సినిమా విజ‌యం సాధించి ఉంటే మ‌రోసారి త‌న‌తో సినిమా తీసేందుకు జాక్ పాట్ కొట్టేసేవాడే. కావాల్సిన‌న్ని కాల్షీట్లు త‌న‌కు ద‌క్కేవి. అయితే ఇప్పుడంతా సీన్ రివ‌ర్సులో ఉంద‌ట‌. అత‌డంటే ఎంత అభిమానం ఉన్నా.. మ‌రో సినిమాలో న‌టించేందుకు ఆమె స‌సేమిరా అంటోంద‌ట‌. దాంతో ప్ర‌స్తుతం ఆ ద‌ర్శ‌కుడు వేరొక క‌థానాయిక‌ను వెతుక్కోవాల్సిన స‌న్నివేశం త‌లెత్తింది. అలాగే డిజాస్ట‌ర్ తీసాక ఛాన్సెవ‌రిస్తారు? అంత‌కుముందు కమిటైన హీరోలు కూడా ముఖం చాటేస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే రిలీజైన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో తాజా ప‌రిణామ‌మిది. ఆ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనే మ‌రో సినిమా క‌లిసి చేద్దామ‌ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు- స్టార్ హీరోయిన్ అనుకున్నారు. మ‌రో లేడీ ఓరియెంటెడ్ ఫిలిం చేయాల‌న్న ప్ర‌పోజ‌ల్ ఉంది. పైగా ఆ సినిమాని తానే నిర్మిస్తాన‌ని స‌ద‌రు క‌థానాయిక మాటిచ్చిందిట‌. అయితే ఒకే ఒక్క డిజాస్ట‌ర్ పెద్ద పంచ్ వేసింద‌ని తెలుస్తోంది. అంత పెద్ద ఫ్లాపొచ్చాక ఇంకా కాల్షీట్లు ఇవ్వ‌డం కుదురుతుందా? అందుకే స‌ద‌రు క‌థానాయిక మ‌రోసారి లేడీ ఓరియెంటెడ్ అన్న మాటే ఎత్త‌కుండా బుద్ధిగా త‌న‌వైపు వ‌చ్చిన క‌థ‌ల‌కు ఓకే చెబుతూ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తోంద‌ట‌. ఇందులో శ‌ర్వానంద్.. క‌ళ్యాణ్ రామ్.. లాంటి త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన హీరోల జాబితా ఉంది. అలాగే సీనియ‌ర్ హీరోలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాలా వ‌ద్దా? అన్న డైల‌మా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.