Begin typing your search above and press return to search.

మిలింద్ అమ్మగారి ఫిట్నెస్ కు నెటిజనులు ఫిదా

By:  Tupaki Desk   |   15 May 2019 12:46 PM IST
మిలింద్ అమ్మగారి ఫిట్నెస్ కు నెటిజనులు ఫిదా
X
ఫేమస్ మోడల్ కం బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన మోడల్ గా కెరీర్ పీక్స్ లో ఉండే సమయంలో ఒక కాండోమ్ యాడ్ కోసం నగ్నంగా ఫోటో షూట్ చేసి జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఇప్పుడు జనాలకు న్యూడిటీ అనేది పెద్ద విషయంగా అనిపించడం లేదు కానీ అప్పట్లో అదో సంచలనం. ఇప్పుడు మిలింద్ వయసు 53. అయినా ఏదో విషయంలో ఆయన వార్తల్లో వ్యక్తి అవుతుంటాడు.

కొద్ది కాలం క్రితం 27 ఏళ్ళ వయసున్న అంకిత కొన్వర్ ను వివాహం చేసుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక తాజాగా మరో విషయంలో ఆయన పేరు.. ఆయన అమ్మగారి పేరు చర్చకొచ్చింది. ఈమధ్యనే సెలబ్రిటీలు అందరూ మదర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు కదా.. అలానే మిలింద్ సోమన్ కూడా జరుపుకున్నాడు. మిలింద్ తన అమ్మగారు ఉషా సోమన్ తో కలిసి ఒక గ్రౌండ్ లో పుష్ అప్స్ చేశాడు. ఆవిడ కూడా 16 పుష్ అప్స్ చేసింది. ఓస్ అంతే కదా అనుకుంటాంరేమో.. ఆవిడ వయసు స్వీట్ గా 80 మాత్రమే.

ఈ వీడియోకు మిలింద్ "మనగురించి జాగ్రత్త తీసుకుంటూ.. వారి చుట్టూ ఉన్నవారి అలనా పాలనా చూస్తూ చాలా సార్లు మన అమ్మలు వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఈ మదర్స్ డే రోజు మనం మన తల్లులకు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో చెప్పి వారికి ప్రేరణనిద్దాం. ఆరోగ్యం విషయంలో ఎప్పటికీ లేట్ అనే మాట లేదు. ఉషా సోమన్.. మా అమ్మ. 80 ఏళ్ళ యువతి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. నెటిజనులు ఈ వీడియో కు థ్రిల్ అయ్యారు. 80 ఏళ్ళ వయసులో ఇలా ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటూ ఫిట్ గా ఉన్న మిలింద్ అమ్మగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. కొందరు నెటిజనులు ఒక బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారంటూ మిలింద్ ను మెచ్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

For Video Click Here