Begin typing your search above and press return to search.

కోట్లిస్తానన్నా కండోమ్ ని కాదన్నాడు

By:  Tupaki Desk   |   17 Sep 2015 1:30 AM GMT
కోట్లిస్తానన్నా కండోమ్ ని కాదన్నాడు
X
కోట్లు కుమ్మరిస్తామంటే ఎవరైనా వద్దంటారా ? అందులోనూ యాడ్ ఎండార్స్ మెంట్ అంటే.. సినీ స్టార్లకు మహా పిచ్చి. ఓ వారం కూడా పట్టని షూటింగ్ కోసం.. 2-3 సినిమాల్లో చేసినా రానంత రెమ్యూనరేషన్ వచ్చేస్తుంది. బయటకు చెప్పకపోయినా.. ఇంతకంటే ఎక్కువ మొత్తమే ఆఫర్ చేసినా వద్దు పొమ్మన్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.

స్టార్ డమ్ అంటే భయం అని చెప్పే బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ. తన యాక్షన్ కరప్షన్ కి గురి కాకూడదంటే.. తాను ఎప్పటికీ స్టార్ కాకూడదని కోరుకుంటానని ఓపెన్ గానే చెప్తాడీయన. ఇతగాడికి ఓ కండోమ్ తయారీ కంపెనీ.. కళ్లు బైర్లు కమ్మే ఆఫర్ ఇచ్చిందట. అయితే సినిమాల్లో పాటించే విలువలు జీవితంలో కూడా పాటించాలి గా అంటూ పోపొమ్మన్నాడు వాళ్లని. డబ్బు కోసం విలువలు, వలువులు వదిలేస్తున్న ఈ రోజుల్లో.. విలువలే ఆస్తి అనేవాళ్లు రియల్ లైఫ్ లో చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటి అరుదైన కేరక్టరే ఈ 49 ఏళ్ల నవాజుద్దీన్ ది కూడా.