Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: తిక్క తిక్కగ ఉందిరోయ్

By:  Tupaki Desk   |   30 July 2016 10:08 PM IST
ట్రైలర్ టాక్: తిక్క తిక్కగ ఉందిరోయ్
X
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సంవత్సరం మరో సినిమా వచ్చేస్తోంది. ''సుప్రీమ్''తో కిక్ ఇచ్చిన ఈ కుర్రాడు ఇప్పుడు ''తిక్క'' అంటూ రెండోసారి ట్రీట్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శనివారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం పదండి.

'ధర్మసంస్థాపనార్ధాయా.. సంథింగ్ షుడ్ బీ డన్‌'.. అంటూ మొదలైన ''తిక్క'' సినిమా ట్రైలర్.. నిజంగానే తిక్క తిక్కగా ఉంది తెలుసా? అసలు కథేంటో.. కాన్సెప్టు ఏంటో.. డైలాగులు ఏంటో.. కామెడీ ఏంటో.. మన కర్తవ్యం ఏంటో.. అబ్బే క్లారిటీ లేదస్సలు. కాకపోతే ఈ సినిమాలో మూడు నాలుగుసార్లు ప్రేమ విఫలమైన లవ్వర్ గా సాయిధరమ్ నటిస్తున్నాడని అర్దమవుతోంది. రకరకాల లవ్ స్టోరీలు ఫెయిలై.. చివరకు ఒక చోటన స్ర్టక్ అయ్యి.. అప్పుడు తిరిగే మలుపుల గోలే ఈ కామెడీ లవ్ స్టోరీ అనమాట. ఏక్ బ్రేకప్ లవ్ స్టోరి. సినిమా మేకింగ్ అండ్ విజువల్స్ సూపర్బ్ కాని.. ట్రైలర్ నెరెటివ్ మాత్రం తిక్క తిక్కగా ఉంది. అదే మా సినిమా స్పెషాలిటీ అంటున్నారు ఈ సినిమా టీమ్. గుహన్ కెమెరా వర్క్ అండ్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయ్ అంతే.

'ఓం 3డి' ఫేం దర్శకుడు సునీల్ రెడ్డి రూపొందిస్తున్న ఈ ''తిక్క'' సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన ఫారిన్ పిల్ల లరిస్సా బొనేసి.. అలాగే మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 13న సినిమా విడుదలవుతోంది.