Begin typing your search above and press return to search.

బీర్‌ బాటిల్ తో గుర్రమెక్కిన మెగా హీరో

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:41 PM IST
బీర్‌ బాటిల్ తో గుర్రమెక్కిన మెగా హీరో
X
తిక్క ఎక్కేస్తే ఏం చేస్తాడు చెప్పండి? అందుకే ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌.. గుర్రం ఎక్కేసి.. ఒక చేతితో బూర ఊదుతూ.. మరో చేతిలో బీరు బాటిల్‌ పట్టుకొని.. వాహ్వా.. గుర్రమెక్కాడు. ఇంతకీ ఎందుకు ఇవన్నీ?

అబ్బే ఏం లేదండ.. ''తిక్క'' సినిమా తొలి మోషన్‌ పోస్టర్ ను రిలీజ్‌ చేశాడు సాయిధరమ్ తేజ్‌. ఈ పోస్టర్ ఇప్పుడు మాంచి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. 'ఓం 3డి' ఫేం సునీల్‌ రెడ్డి డైరక్షన్‌ లో రూపొందిన ఈ సినిమాను.. దాదాపు మొత్తం మలేషియాలోనే షూట్‌ చేశారు. లరేసా బొనేసి అనే ఫారిన్‌ పిల్ల హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇక మోషన్‌ పోస్టర్ ను చూస్తే మాత్రం చాలా కాన్సెప్చువల్‌ గా అనిపించకమానదు. అలాగే తమన్‌ మరోసారి తన టెరిఫిక్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్ తో ఇరగదీశాడు. టాలెంటెడ్‌ కెమెరామ్యాన్ కె.వి.గుహన్‌ ఛాయాగ్రహణం హైలైట్‌ అయ్యేలా ఉందని కూడా ఈ మోషన్‌ పోస్టర్ చెబుతోంది.

ఇప్పటికే సుబ్రమణ్యం ఫర్ సేల్‌.. సుప్రీమ్‌.. వంటి సినిమాలో వరుస హిట్లు కొట్టిన సాయిధరమ్‌ కు ఈ సినిమా హ్యాట్రిక్ అందిస్తుందో లేదో చూడాలి మరి.