Begin typing your search above and press return to search.
పవన్ ఇంట్రడక్షన్ సీన్ ని షూట్ చేస్తారట
By: Tupaki Desk | 7 July 2021 9:00 AM ISTమలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్న సంగతి తెలిసినదే. ఇంతకుముందు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాక సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న తిరిగి ప్రారంభమవుతుంది.
ప్రారంభమే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో పవన్ పరిచయ సన్నివేశం కానుందని తెలిసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్ర పోషించనుంది. చిత్రీకరణలో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఇంతకుముందు పవన్ కల్యాణ్ -రానా మల్టీస్టారర్ కి సంబంధించిన లీకులు బయటకు వచ్చాయి. పవన్ కల్యాణ్ పై థ్రిల్లింగ్ సీక్వెన్సుకు సంబంధించిన ఫోటో లీకైన సంగతి తెలిసిందే.
మాతృక లో పృథ్వీరాజ్ - బిజు మీనన్ లాంటి స్టార్లు పోషించిన పాత్రల్లోనే పవన్ - రానా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఆద్యంతం ఆ ఇద్దరి మధ్యా ఘర్షణ రక్తి కట్టిస్తుంది. తెలుగు వెర్షన్ లో పవన్ - రానా మధ్య సీన్స్ ని సాగర్ చంద్ర రక్తి కట్టించేలా తీర్చిదిద్దనున్నారని తెలిసింది. ఇక ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరానువాద పర్యవేక్షకుడిగా ఉన్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్వయంగా మాటలు అందిస్తున్నారు.