Begin typing your search above and press return to search.
చిరు.. పవన్.. ప్రభాస్ టైటిల్స్ ఇవే
By: Tupaki Desk | 6 Feb 2020 8:00 PM ISTఅగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మూడు చిత్రాలు అభిమానుల అంచనాల నడుమ వస్తున్నాయి కాబట్టి హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ `నంబర్ 150`తో బ్లాక్ బస్టర్ కొట్టి..152వ చిత్రం సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్టార్ గా ఆకట్టుకున్నారు. ఇక పవన్ మొన్నటివరకూ రాజకీయాల్లో బిజీగా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా రీఎంట్రీ ఇస్తుండడంతో పీఎస్.పీకే 26 పైనా అంతే అంచనాలేర్పడ్డాయి. అతడు నటిస్తున్న పింక్ రీమేక్ ప్రముఖంగా చర్చల్లోకొస్తోంది.
అటు అన్నయ్య..ఇటు తమ్ముడు ఇద్దరూ ఒకేసారి షూటింగ్ లో బిజీ అవ్వడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అయిన ప్రభాస్ సాహో అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. దీంతో రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతన్న పీరియాడికల్ లవ్ స్టోరీతో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసి మీదున్నాడు. అయితే ఆ ముగ్గురి టైటిల్స్ పై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది. రకరకాల టైటిల్స్ ప్రచారం లో ఉన్నా అవేవీ అధికారికం కావు. అసలింతకీ ఆ ముగ్గురు టాప్ స్టార్ల చిత్రాల టైటిల్స్ ఏంటి? అంటే.. చాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ ని పరిశీలిస్తే ఓ క్లారిటీ వచ్చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రానికి కొరటాల శివ `ఆచార్య ` అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేసారు. పవర్ స్టార్ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు `వకీల్ సాబ్` అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారుట. అయితే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ `లాయర్ సాబ్` అన్న ప్రచారం ఉంది. మరి ఇది వర్కింగ్ టైటిలా? వకీల్ సాబ్ గా మారుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ కథానాయకుడిగా `జిల్` ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇప్పటికే జాన్ అనే టైటిల్ తో ప్రేక్షకుల్లోకి వెళ్లి పోయింది. వర్కింగ్ టైటిల్ గా పెట్టినట్లు మరో ప్రచారం వెడక్కిస్తోంది. కానీ ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ `ఓ డియర్`, `రాధే`, `శ్యామ్` అనే మూడు టైటిల్స్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. టైటిల్స్ అన్నీ ఆసక్తి కరంగానే ఉన్నాయి. సినిమాల్లో దమ్ము ఎంత అన్నది ఇంపార్టెంట్.