Begin typing your search above and press return to search.

పవన్‌ పాటతోనూ మిస్‌ 'మ్యాచ్‌' అవ్వట్లేదు

By:  Tupaki Desk   |   28 Nov 2019 12:12 PM IST
పవన్‌ పాటతోనూ మిస్‌ మ్యాచ్‌ అవ్వట్లేదు
X
ఆటగదరా శివ చిత్రంతో నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఉదయ్‌ శంకర్‌ మరియు కౌశల్య కృష్ణ మూర్తితో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఐశ్వర్యా రాజేష్‌ లు జంటగా తెరకెక్కిన చిత్రం 'మిస్‌ మ్యాచ్‌'. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఫస్ట్‌ లుక్‌ ను క్రిష్‌ విడుదల చేయగా.. ఒక పాటను త్రివిక్రమ్‌ విడుదల చేశాడు. సెలబ్రెటీలతో ఎంత హడావుడి చేస్తున్నా కూడా ఈ సినిమా గురించి జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రేక్షకుల్లో నోటెడ్‌ అవ్వలేక పోయింది. ఇప్పుడు పవన్‌ పేరును ఉపయోగించి పబ్లిసిటీ పొందే ప్రయత్నాలను చిత్ర యూనిట్‌ సభ్యులు చేస్తున్నారు.

ఇటీవల జార్జ్‌ రెడ్డి సినిమా విషయంలో పవన్‌ పేరును ఉపయోగించినందుకు మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. ఇప్పుడు అలాగే మిస్‌ మ్యాచ్‌ యూనిట్‌ సభ్యులు కూడా ఈ సినిమాకు పవన్‌ ను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో తొలిప్రేమ సినిమాలోని ఈమనసే సేసే అనే పాటను రీమేడ్‌ చేశారు. లిరిక్స్‌ అంతా సేమ్‌ ఉంచి ట్యూన్‌ కాస్త మార్చి మరో సింగర్‌ తో ఈ పాటను పాడించారు.

ఈమనసే పాట రీమేడ్‌ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో యూట్యూబ్‌ లోకి వచ్చి రెండవ రోజు అవుతుంది. కాని నెటిజన్స్‌ పట్టించుకుంటున్న దాఖలాలే లేవు. 24 గంటల్లో ఈ ప్రోమో కనీసం అయిదు వేల వ్యూస్‌ ను కూడా దక్కించుకోలేక పోయింది. పవన్‌ కు ట్రిబ్యూట్‌ అంటూ మెగా ఫ్యాన్స్‌ ను ఆకట్టుకునేందుకు మిస్‌ మ్యాచ్‌ టీం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్‌ అవుతున్నట్లుగా అనిపించడం లేదు. సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేయడానికి మరేదైనా మార్గంలో పబ్లిసిటీ ట్రై చేస్తే బెటర్‌. ఇలాగే సినిమాను విడుదల చేస్తే విడుదల తర్వాత కూడా జనాలు పట్టించుకోక పోవచ్చు.