Begin typing your search above and press return to search.

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మలే పర్ఫెక్ట్‌

By:  Tupaki Desk   |   17 Dec 2022 5:29 AM GMT
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మలే పర్ఫెక్ట్‌
X
సినిమా ఇండస్ట్రీలో హీరోలదే ఆదిపత్యం అనడంలో సందేహం లేదు. థియేటర్ కు ప్రేక్షకులను రప్పించడం కేవలం హీరోలకే సాధ్యం. అతి కొద్ది మంది దర్శకులు కూడా హీరో హీరోయిన్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలరు. ఇక హీరోయిన్స్ లో కూడా కొందరు ఇతర స్టార్ కాస్ట్ లేకుండా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న వారు ఉన్నారు.

సౌత్‌ స్టార్‌ హీరోయిన్స్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా మందే చేశారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. తెలుగు స్టార్‌ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా మారింది. అరుంధతి సినిమా తర్వాత అనుష్క స్థాయి స్టార్‌ హీరో రేంజ్ లో పెరిగింది. ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు కూడా ఆమె ఫేస్‌ వ్యాల్యూతోనే సక్సెస్ అవ్వబోతున్నాయి.

ఇక సౌత్ లో లేడీ సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న నయనతార కూడా హీరోల స్థాయిలో తన సినిమాలతో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగల సత్తా ఉంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల సంఖ్య తగ్గించింది. ప్రస్తుతం పిల్లల యొక్క ఆలనా పాలనతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మళ్లీ బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక సమంత వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ సక్సెస్ లతో దూసుకు పోతున్న సమయంలో అనూహ్యంగా ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె మళ్లీ పూర్వ వైభవం ను దక్కించుకుని తన సత్తా చాటాలని.. స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో తన సినిమాతో వసూళ్లు దక్కించుకోవాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

ఇక అనుపమ పరమేశ్వరన్ కి కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈమె హీరోలతో సంబంధం లేకుండా తనకు ఉన్న ఫాలోయింగ్‌ తో థియేటర్‌ కు అభిమానులను రప్పించగలదు. కీర్తి సురేష్ కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె ఎంపిక చేసుకుంటున్న కథలు మరియు దర్శకులు సరిగా లేరు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తమన్నా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ప్రయత్నించినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. వీళ్లు కాకుండా మరి కొందరు కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ట్రై చేస్తున్నారు. కాని జనాలు వారిని ఆధరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రేక్షకులు కేవలం అనుష్క.. సమంత.. కీర్తి సురేష్‌.. నయనతార వంటి లేడీ సూపర్ స్టార్స్ యొక్క లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.