Begin typing your search above and press return to search.

టాప్ -10 హీరోల షెడ్యూల్స్ ఇవే

By:  Tupaki Desk   |   1 July 2019 5:30 PM GMT
టాప్ -10 హీరోల షెడ్యూల్స్ ఇవే
X
టాలీవుడ్ టాప్ 10 హీరోలు ఆన్ లొకేష‌న్ బిజీబిజీ. కొంద‌రు హైద‌రాబాద్ లోక‌ల్ గానే షూటింగుల్లో పాల్గొంటుండ‌గా.. మ‌రికొంద‌రు ఔట్ డోర్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు. ఏ హీరో ఎక్క‌డ షూటింగ్ లో ఉన్నారు? అన్న వివ‌రాలు ప‌రిశీలిస్తే..

*చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సైరా నరసింహారెడ్డి` టోట‌ల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. కోకా పేట్ లో ప్యాచ్ వ‌ర్క్ స‌హా ఓవ‌రాల్ గా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. గ‌త నెల 23న గుమ్మ‌డికాయ కొట్టేయ‌గా.. ఇటీవ‌లే చిరంజీవి డ‌బ్బింగ్ ప‌నులు పూర్తి చేశారు. గ్రాఫిక్స్ వ‌ర్క్ - డీఐ స‌హా ఇత‌ర‌త్రా ప‌నులు పూర్తి చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి- చ‌ర‌ణ్ బృందం వీటిని ప‌ర్య‌వేక్షిస్తోంది.

*అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న `మన్మథుడు 2` సినిమా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్రస్తుతం స్విజ్జర్లాండ్ పాటలు చిత్రీకరణ సాగుతోంది. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే అంత ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో అద్భుత లొకేష‌న్ల‌లో పాట‌ల్ని తెర‌కెక్కిస్తున్నారు.

*నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 25 న ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం తొలి షెడ్యూల్ సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లో సెట్స్ లో జ‌రుగుతోంది. ఇటీవ‌లే బాల‌య్య బాబు కొత్త లుక్ రివీలైన సంగ‌తి తెలిసిందే.

* వెంకటేష్- నాగచైతన్య ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో నటిస్తున్న మల్టీ స్టారర్ `వెంకీ మామ` షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఇటీవ‌ల‌ పాట చిత్రీకరణ పూర్తి చేసారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. పాయ‌ల్ రాజ్ పుత్- రాశీఖ‌న్నా త‌దిత‌రులు నటిస్తున్నారు.

* ప్రభాస్‌- శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సాహో` సినిమా లోని ఓ పాటను అస్ట్రియాలో తెరకెక్కిస్తున్నారు. మంచు కొండ‌ల్లో ఎంతో ఎత్త‌యిన ప్ర‌దేశంలో చిత్రీక‌రించిన ఈ పాట స‌రికొత్త అనుభూతిని ఇస్తుంద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. ర‌క్తం గ‌డ్డ క‌ట్టే చలిలో చిత్ర‌యూనిట్ సాహ‌స‌మే చేశార‌ట‌.

*యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతోంది. గ‌త నెల 24 నుంచి చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

*అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో, హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ హౌస్ సెట్ లో పూర్త‌యింది. బ‌న్ని ప్ర‌స్తుతం కుటుంబ స‌మేతంగా ముంబైలో ఉన్నారు. జూలై 5 నుంచి పొల్లాచి లో 20 రోజుల పాటు షూటింగ్ కి తిరిగి అటెండ‌వుతార‌ట‌.

*వరుణ్‌తేజ్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న `వాల్మీకి` సినిమా షూటింగ్ అనంతపురం లో జరుగుతుంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ప‌క్కాగా షెడ్యూల్స్ ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేస్తున్నార‌ట‌.

*విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సినిమా `హీరో` షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీ లో జరుగుతుంది.

*నాని హీరోగా- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న`గ్యాంగ్ లీడర్‌` షూటింగ్ తుఫ్రాన్ లో జ‌రుగుతోంది. నాని కెరీర్ లో ఇదో ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మ‌ని చెబుతున్నారు. ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.