Begin typing your search above and press return to search.

24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ టీజర్స్ ఇవే..!

By:  Tupaki Desk   |   19 April 2021 5:00 PM IST
24 గంటల్లో అత్యధిక వ్యూస్ రాబట్టిన టాలీవుడ్ టీజర్స్ ఇవే..!
X
సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి సినిమా వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సామాజిక మధ్యమాలలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కు వచ్చే రెస్పాన్స్ ను బట్టి దాని రేంజ్ ఏంటో అంచనా వేసే పరిస్థితులు వచ్చాయి. టీజర్ - ట్రైలర్ లను యూట్యూబ్ లో విడుదల చేసి ఫలానా సినిమా ట్రైలర్ ఇన్ని వ్యూస్ రాబట్టిందని.. ఒక రోజులో ఆ సినిమా టీజర్ అన్ని మిలియన్ల వ్యూస్ అందుకుందని ప్రమోట్ చేసుకుంటున్నారు. వీటికి సినిమా రిజల్ట్ తో సంబంధం లేనప్పటికీ.. తమ ఫేవరేట్ హీరో రేంజ్ ఏంటో తెలుపుతాయని అభిమానులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్స్ ఏవో ఒక్కసారిగా చూద్దాం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' టీజర్ ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదలైంది. ఈ టీజర్ 24 గంటల్లో 22.52 మిలియన్ల వ్యూస్ అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా అనీల్ రావిపూడి రూపొందించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ 14.64 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. మొన్నటి వరకు ఇదే టాప్ లో ఉండగా 'పుష్ప' టీజర్ దీనిని బీట్ చేసింది. అలానే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా నుంచి వచ్చిన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రిలీజ్ చేసిన ఒకరోజులో 14.14 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' - 12.94 మిలియన్స్.. మహేష్ బాబు నటించిన 'మహర్షి' - 11.14 మిలియన్స్.. 'భరత్ అనే నేను' - 8.67 మిలియన్స్ తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' (8.57 మిలియన్స్) - మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' (7.49 మిలియన్స్) - నందమూరి బాలకృష్ణ 'అఖండ' (7.35 మిలియన్స్) వ్యూస్ అందుకున్నాయి. రికార్డులనేవి శాశ్వితం కాదు కనుక రాబోయే రోజుల్లో వీటిని ఏ సినిమా టీజర్లు బ్రేక్ చేస్తాతో చూడాలి