Begin typing your search above and press return to search.

సొంత ఛార్టెడ్ ఫ్లైట్లు ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే

By:  Tupaki Desk   |   2 Jan 2021 1:00 PM IST
సొంత ఛార్టెడ్ ఫ్లైట్లు ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే
X
సినిమాల్లో తరచూ కనిపించే సీన్ ఇప్పుడు రియల్టీలోకి వచ్చేసింది. ఒక బడా పారిశ్రామికవేత్త.. అతడి రేంజ్ చూపించాలంటే.. తన సొంత విమానంలో వెళుతుంటాడు. ఇలాంటి సీన్లు రీల్ లో చాలానే చూసి ఉంటాం. కానీ..రియల్ లైఫ్ లో సొంత ఛార్టెడ్ విమానాలు ఉండే వారిని వేళ్ల మీద లెక్కబెట్టుకోవచ్చు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. టాలీవుడ్ హీరోల్లో పలువురికి తమదైన సొంత విమానాలు ఉండటం విశేషంగా చెప్పాలి.

ఇటీవల జరిగిన నాగబాబు కుమార్తె నిహారిక వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగటం తెలిసిందే. దీని కోసం తమ సొంత విమానాల్లో కుటుంబ సభ్యులతో సహా వెళ్లటంతో.. టాలీవుడ్ హీరోల రేంజ్ కొత్త చర్చకు తెర తీసింది. టాలీవుడ్ హీరోల్లో సొంత విమానాలు ఉన్న వారి జాబితా కాస్త పెద్దదిగానే చెప్పాలి. సీనియర్ నటుల విషయానికి వస్తే.. హీరో నాగార్జునకు సొంత విమానం ఉందంటున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లటానికి దీన్ని వాడుతుంటారు. తాజాగా తన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం దీన్ని వాడారు. దీనికి కారణం.. సినిమా షూటింగ్ మధ్యలో బిగ్ బాస్ షూటింగ్ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దీంతో.. ఆయన తన సొంత విమానాన్ని వాడారు.

నిహారిక పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీలోని హీరోలకు సొంత విమానాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. అల్లు అర్జున్ తన సొంత విమానంలోనే ఆ పెళ్లికి వెళ్లారు. చిరు ఫ్యామిలీకి సొంత ఫ్లైట్ ఉంది. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో దీన్ని కొనుగోలు చేశారని చెబుతారు. నిహారిక పెళ్లికి తమ సొంత విమానంలోనే వారు వెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ కు సొంత విమానం ఉంది. ఈ మధ్యనే రూ.80 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.

మరి.. సొంత విమానాలు ఉన్న హీరోలు వాటిని ఎక్కడ ఉంచుతారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇట్టే వచ్చేస్తుంది. తమకు సమీపంలో ఉన్న ఎయిర్ పోర్టులో వాటిని ఉంచి.. నిర్వహణ ఒప్పందాలు ఆయా ఎయిర్ పోర్టులోని కంపెనీలతో చేసుకుంటాయి. అంతేకాదు.. తమకు అవసరంలేని సందర్బాల్లో ఛార్టెడ్ విమానాల్ని అద్దెకు కూడా ఇస్తున్నారట. మొత్తానికి టాలీవుడ్ హీరోలు మా జోరుతో ఉన్నట్లు అనిపించట్లేదు?