Begin typing your search above and press return to search.

బిబి లీక్ : ఈ వారం నామినేషన్‌ లో ఉన్నది వీళ్లే

By:  Tupaki Desk   |   9 Nov 2020 2:30 PM GMT
బిబి లీక్ : ఈ వారం నామినేషన్‌ లో ఉన్నది వీళ్లే
X
తెలుగు బిగ్‌ బాస్‌ 10వ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు 8 మంది ఎలిమినేట్‌ అవ్వగా ఇద్దరు అనారోగ్య కారణాలతో బిగ్‌ బాస్ హౌస్ ను వీడారు. ప్రస్తుతం హౌస్‌ లో 9 మంది ఉంటంతో షో చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఉన్న వారు అంతా కూడా బలమైన కంటెస్టెంట్స్‌ అవ్వడంతో ఎవరు వెళ్లినా కూడా చాలా పెద్ద విషయమే. అందుకే ఈ వారం ఎలిమినేషన్‌ కు ఎవరు నామినేట్‌ అవ్వబోతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌ నిన్ననే జరిగి ఉంటుంది. కనుక మరోసారి బిగ్‌ బాస్‌ టీం నుండి ఎలిమినేషన్‌ లో ఎవరు ఉండబోతున్నారో లీక్ వచ్చింది.

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా అభిజిత్‌.. హారిక.. మోనాల్‌ లు ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యారు. ఇక కెప్టెన్‌ గా కాస్త ఓవర్‌ యాక్షన్‌ చేసినందుకు గాను అరియానాకు ఎలిమినేషన్‌ నామినేషన్‌ తప్పలేదు. ఇన్ని రోజులు లక్కీగా తప్పించుకుంటూ వస్తున్నా ఈసారి మాత్రం మెహబూబ్‌ నామినేట్‌ అవ్వక తప్పలేదు. ఈ వారంలో అవినాష్‌ కు ఇమ్యూనిటీ దక్కడం వల్ల అతడిని ఎవరు నామినేట్‌ చేయలేదు.

ఇక లాస్య.. అఖిల్‌ మరియు సోహెల్‌ లు కూడా ఈ వారం నామినేట్‌ అవ్వలేదు. దాంతో వారు అంతా మరో రెండు వారాలు ఇంటిలో కొనసాగబోతున్నారు. ఈ వారం ఎలిమినేట్‌ అయిన వారిలో మోనాల్‌ మరియు మెహబూబ్‌ లు కాస్త వీక్‌ గా కనిపిస్తున్నారు. మరి ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేది చూడాలి.