Begin typing your search above and press return to search.

'రామరాజు ఫర్ భీమ్' వీడియోలో హైలైట్స్ అవేనంట!

By:  Tupaki Desk   |   3 April 2020 2:30 PM GMT
రామరాజు ఫర్ భీమ్ వీడియోలో హైలైట్స్ అవేనంట!
X
సినిమాను పబ్లిసిటీ చేసుకోవడం లో రాజమౌళిని మించిన దర్శకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచమంతా కరోనా దెబ్బకి వణికిపోతున్న ఈ సమయంలో కూడా తన 'రౌద్రం రణం రుధిరం' సినిమాని జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కి ఈ వీడియోలో రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మే 20వ తేదీన ఎన్టీఆర్ వీడియో రానున్నదని సమాచారం.

ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రామరాజు ఫర్ భీమ్' అన్నమాట. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ వచ్చిన వీడియోలో ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోలో ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తారో అని ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చ నడుస్తోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండదు అట. ఎన్టీఆర్ నే స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని, అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన కీలకమైన సీన్స్ కూడా రివీల్ చేయబోతున్నారని.. ‘ఎన్టీఆర్’ సర్ ప్రైజ్ వీడియోలో ఇవే హైలైట్స్ గా నిలివబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఉత్సాహపరుస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.