Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో 'స్టార్స్' గా వెలుగొందుతున్న హీరోయిన్లు వీరే..!

By:  Tupaki Desk   |   22 Jan 2022 9:30 AM GMT
టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగొందుతున్న హీరోయిన్లు వీరే..!
X
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ఇప్పటికే ఏలుతున్న ముద్దుగుమ్మలతో పాటుగా సినిమాకో కొత్త బ్యూటీ పరిచయం అవుతూనే ఉంది. ఎంతమంది వచ్చినా అందంతో - అభినయంతో పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి వచ్చిన భామలు మాత్రమే ఇక్కడ మనుగడ సాగిస్తుంటారు. స్టార్ స్టేటస్ అందుకొని కొన్నాళ్ల పాటు తమ హవా చూపిస్తుంటారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజాహెగ్దే - రష్మిక మందన్నా - సాయిపల్లవి - కీర్తి సురేశ్ - కృతి శెట్టి - రాశీఖన్నా - కియరా అద్వాని - అనుపమ పరమేశ్వరన్ - నిధి అగర్వాల్ - అను ఇమ్మాన్యుయేల్‌ వంటి ముద్దుగుమ్మలు స్టార్స్ గా వెలుగొందుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హవా కొనసాగిస్తున్న సమంత - తమన్నా - కాజల్ - నయనతార - శృతి హాసన్ - అనుష్క వంటి భామలు సూపర్ సీనియర్లుగా వెలుగొందుతున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ వంటి మరికొందరు బ్యూటీలు ఫేడ్ అవుట్ అయ్యే దశలో ఉన్నారు.

గతేడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న పూజాహెగ్డే.. ఈ ఏడాది 'ఆచార్య' 'రాధే శ్యామ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదే క్రమంలో మహేష్ బాబు తో 'SSMB28' - పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' వంటి రెండు క్రేజీ చిత్రాల్లో బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.

'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ఇప్పుడు తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ చేస్తోంది. అంతేకాదు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న 'పుష్ప: ది రూల్' చిత్రంలో రష్మిక భాగం కానుంది. ఇటీవల 'రౌడీ బాయ్స్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ తో కలిసి '18 పేజెస్' 'కార్తికేయ 2' వంటి సినిమాలు చేస్తోంది.

'లవ్ స్టోరీ' 'శ్యామ్ సింగరాయ్' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. రానా దగ్గుబాటితో కలిసి నటించిన 'విరాటపర్వం' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికైతే సాయి పల్లవి తదుపరి తెలుగు ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. కాకపోతే కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. లేటెస్టుగా 'హీరో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' వంటి పాన్ ఇండియా మూవీ చేస్తోంది.

'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే నాని తో కలిసి 'దసరా' అనే మూవీ చేస్తోంది. ఇక బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కియార ప్రస్తుతం శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

కుర్ర భామ కృతి శెట్టి గతేడాది 'ఉప్పెన' 'శ్యామ్ సింగరాయ్' వంటి రెండు విజయాలు అందుకుంది. లేటెస్టుగా 'బంగార్రాజు' చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఇదే క్రమంలో సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి'.. రామ్ పోతినేని సరసన 'ది వారియర్'.. నితిన్ తో కలిసి 'మాచర్ల నియోజకవర్గం' వంటి సినిమాలలో కృతి హీరోయిన్ గా నటిస్తోంది.

భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో 'థాంక్యూ' అనే సినిమా చేస్తోంది. అలానే గోపీచంద్ - మారుతి కాంబోలో రూపొందుతున్న 'పక్కా కమర్షియల్' సినిమాలో నటిస్తోంది. దసరాకు 'మహాసముద్రం' సినిమాతో వచ్చిన మాలీవుడ్ గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌.. ప్రస్తుతం అల్లు శిరీష్ తో 'ప్రేమ కాదంట' మూవీ చేస్తోంది. అలానే మాస్ మహారాజా రవితేజ సరసన 'రావణాసుర' చిత్రంలో నటిస్తోంది.

సూపర్ సీనియర్ హీరోయిన్ల విషయానికొస్తే.. సమంత 'శాకుంతల' 'యశోద' వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తోంది. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి 'సలార్' అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇదే క్రమంలో బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న కమర్షియల్ సినిమాలో భాగం కానుంది.

'సీటీమార్' తో సక్సెస్ అందుకున్న తమన్నా భాటియా.. ప్రస్తుతం 'ఎఫ్ 3' 'గుర్తుందా శీతాకాలం' 'భోళా శంకర్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక చందమామ కాజల్ అగర్వాల్ నటించిన 'ఆచార్య' 'హే సినామిక' వంటి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార 'గాడ్ ఫాదర్' సినిమాలో నటిస్తుండగా.. నవీన్ పాలిశెట్టితో అనుష్క ఓ మూవీ చేస్తోంది. గతేడాది 'చెక్' 'కొండపొలం' వంటి రెండు పరాజయాలు అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులో ఇంకా తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.