Begin typing your search above and press return to search.

ఈ వారం పెద్ద‌తెర - OTT రిలీజ్ లు ఇవే

By:  Tupaki Desk   |   26 July 2022 4:11 PM GMT
ఈ వారం పెద్ద‌తెర - OTT రిలీజ్ లు ఇవే
X
వారం వారం సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో కోలాహాలం కొన‌సాగుతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌తో పాటు ఓటీటీల్లో కొత్త సిరీస్ లు అభిమానుల ముందుకు వ‌స్తున్నాయి. ఎట్ట‌కేల‌కు జూలై చివరి వారం వచ్చేసింది.

ఈ ఏడాది ఏడు నెల‌లు ముగిసాయి. ఈ వారంలో సినీ అభిమానులను అలరించేందుకు కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌గా.. కొన్ని సిరీస్ లు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం థియేటర్ లు .. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో విడుద‌ల‌కు రానున్న వాటి వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. వీటిలో ఆర్.ఆర్.ఆర్ లాంటి క్రేజీ సినిమా కూడా ఉంది.

థియేటర్లలో కిచ్చా సుదీప్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం `విక్రాంత్ రోనా` విడుద‌ల కానుంది. జూలై 28 డేట్ లాక్ అయ్యింది. అదే రోజు య‌శ‌ర‌వ‌ణ‌న్ న‌టించిన‌ `ది లెజెండ్` విడుద‌ల‌వుతుండ‌గా.. ఒక రోజు ఆల‌స్యంగా టాలీవుడ్ లో ర‌వితేజ న‌టించిన రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుద‌ల‌వుతోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ ఏక్ విలన్ రిటర్న్స్ -జూలై 29 న వ‌స్తోంది.

OTT లో విడుద‌ల‌కు వ‌స్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆహా వీడియోలో జూలై 29న షికారు విడుద‌ల‌వుతోంది. మాధ‌వ‌న్ న‌టించిన హిట్ చిత్రం `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్` - జూలై 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల‌వుతోంది.

అమెజాన్ ప్రైమ్ లోనే ది బాట్ మాన్ - జూలై 27న‌..కేస్ తో బంటా హై (షో) - జూలై 29న విడుద‌ల‌వుతున్నాయి
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో RRR - జూలై 26న విడుద‌ల‌వుతుండ‌గా జూలై 29న గుడ్ లక్ జెర్రీ (హిందీ) ...19 (1)(ఎ) (మలయాళం)..వట్టం (తమిళం) విడుద‌ల‌వుతున్నాయి. జూలై 27న ఆడమాస్ (కొరియన్) విడుద‌ల కానుంది. వూట్ లో జూలై 29న చార్లీ విడుద‌ల కానుంది.

నెట్ ఫ్లిక్స్ లో అర‌డ‌జ‌ను సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ది మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (సిరీస్) జూలై 27న విడుద‌ల‌వుతోంది. డ్రీమ్ హోమ్ మేకోవ‌ర్ S3 (ఇంగ్లీష్) అదే రోజు విడుద‌ల కానుంది. కీప్ బ్రీతింగ్ (సిరీస్) - జూలై 28న .. మసాబా మసాబా S2 (హిందీ) - జూలై 29న ..పర్పుల్ హార్ట్స్ (ఇంగ్లీష్)- జూలై 29న స్ట్రీమింగుకి రానున్నాయి. ZEE5 లో జూలై 29న పేపర్ రాకెట్ తో పాటు రంగబాజ్ S3 (హిందీ) విడుద‌ల కానున్నాయి.