Begin typing your search above and press return to search.

ఆ టీజర్ కు అప్పుడే 80 లక్షల హిట్లా?

By:  Tupaki Desk   |   19 Feb 2016 9:30 AM GMT
ఆ టీజర్ కు అప్పుడే 80 లక్షల హిట్లా?
X
ఎంతైనా తమిళ హీరోలు తమిళ హీరోలే. సౌత్ ఇండియా మొత్తంలో వాళ్లకున్న క్రేజే వేరు. ఫాలోయింగ్ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే కాదు.. విజయ్, అజిత్ కూడా తక్కువేమీ కాదు. వాళ్ల సినిమాలు రిలీజైనపుడు ఉండే సందడే అందుకు నిదర్శనం. మూణ్నెల్ల కిందట అజిత్ మూవీ ‘వేదాలం’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అంతా చూశారు. ఇప్పుడు విజయ్ కొత్త సినిమా ‘తెరి’ విషయంలో అంతకంటే ఎక్కువ హైపే ఉంది. విజయ్ మేనియా ఏ స్థాయిలో ఉందంటే.. ‘తెరి’ ఫస్ట్ టీజర్ కేవలం రెండు వారాల్లోనే 80 లక్షలకు పైగా హిట్లు సంపాదించుకుంది.

తొలి రోజే పది లక్షలకు పైగా వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్.. వరుసగా సౌత్ ఇండియన్ సినిమాల యూట్యూబ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ వెళ్తోంది. ఈ స్పీడు చూస్తుంటే రిలీజైన నెల లోపే కోటి వ్యూస్ మార్కును కూడా దాటేసేలా ఉంది. ఆల్రెడీ 83 లక్షల మార్కుకు చేరువగా ఉంది తెరి టీజర్. ‘రాజా రాణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అత్లీ తీస్తున్న రెండో సినిమా ఇది. విజయ్ పోలీస్ అవతారంలో కనిపిస్తున్నాడు. సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో టీజర్ ను బట్టే తేలిపోయింది. సమంత, అమీజాక్సన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.