Begin typing your search above and press return to search.

కోలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు

By:  Tupaki Desk   |   18 April 2016 7:30 AM GMT
కోలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు
X
తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ తర్వాత అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయే. గత కొన్నేళ్లలో అతడి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఈ మధ్య అతడికి వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు అన్నది చాలా సింపుల్ విషయం అయిపోయింది. తుపాకి.. కత్తి లాంటి సూపర్ హిట్లతోనే కాదు.. ‘పులి’ లాంటి ఫ్లాప్ మూవీతో కూడా 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నాడతను. ఇక లేటెస్ట్ మూవీ ‘తెరి’ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతోంది. డివైడ్ టాక్ తో మొదలైన ఈ సినిమా తొలి రోజే రూ.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాన్-రజనీకాంత్ సినిమాల్లో కోలీవుడ్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.60 కోట్ల వసూళ్లతో ట్రేడ్ పండిట్లను అబ్బురపరిచింది.

ఇంతకుముందు విజయ్ సినిమాల్లో దేశీయ వసూళ్లు మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ యుఎస్ లో అతడి సినిమాలకు ఈ స్థాయిలో ఆదరణ ఉండేది కాదు. అసలు మొత్తంగా తమిళ సినిమాలకే అక్కడ ఆదరణ తక్కువ. అమెరికాలో తెలుగు సినిమాలదే హవా. ఐతే ‘తెరి’ మాత్రం అక్కడ కూడా అదరగొట్టింది. తొలి వీకెండ్లో ‘తెరి’ యుఎస్ కలెక్షన్లు 9.2 లక్షల డాలర్లను చేరుకున్నట్లు ట్రేండ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా మిలియన్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘తెరి’ కంటే ఒక రోజు ఆలస్యంగా రిలీజైన తెలుగు వెర్షన్ ‘పోలీస్’ కూడా నెగెటివ్ టాక్ ను తట్టుకుని మంచి వసూళ్లే సాధించింది. వీకెండ్ అయ్యేసరికే దిల్ రాజు పెట్టుబడి వెనక్కి వచ్చేసినట్లు చెబుతున్నారు. రొటీన్ సినిమానే అయినప్పటికీ మసాలా అంశాలకు.. హీరోయిజానికి ఢోకా లేకపోవడంతో విజయ్ సేఫ్ గా బాక్సాఫీస్ రన్ పూర్తి చేసేలా ఉన్నాడు.