Begin typing your search above and press return to search.

హ‌వ్వ‌! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క‌ ఐమ్యాక్స్ స్క్రీన్ లేదు!!

By:  Tupaki Desk   |   3 Nov 2022 5:15 AM GMT
హ‌వ్వ‌! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క‌ ఐమ్యాక్స్ స్క్రీన్ లేదు!!
X
తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2' అభిమానులకు నిరాశ ఎదురు కానుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. దానికి కార‌ణం ఇరు రాష్ట్రాల్లో 8కోట్ల మంది జ‌నాభాకు క‌నీసం ఒక్క ఐమ్యాక్స్ స్క్రీన్ అయినా అందుబాటులో లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. నిజానికి కామెరూన్ 'అవ‌తార్' ని పండోరా గ్ర‌హాన్ని తొలిసారిగా ఐమ్యాక్స్ స్క్రీన్ లో వీక్షించిన వారికి ఇప్పుడు అలాంటి స్క్రీన్ లో కాకుండా నార్మ‌ల్ స్క్రీన్ లో వీక్షిస్తే ఆ అనుభూతిని తిరిగి పొంద‌డం అసాధ్యం. అందుకే ఇప్పుడు చాలా మంది ఐమ్యాక్స్ ప్రియులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు.

అవ‌తార్ చిత్రాన్ని మొదటి సారి హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ - 3డిలో వీక్షించిన వారిది ఒక అరుదైన అతీత‌మైన అనుభ‌వం. అస‌లు అవ‌తార్ లు మ‌న మ‌ధ్య‌నే సంచ‌రిస్తున్నాయా? అనిపించేంత‌టి గొప్ప అనుభూతి కలుగుతుంది. లేదా మ‌న‌మే పండోరా గ్ర‌హంపై సంచ‌రించామా? అన్న ఫీల్ ని ఐమ్యాక్స్ స్క్రీన్ ఆడియెన్ కి క‌లిగిస్తుంది. కానీ ఇప్పుడు అవ‌తార్ 2 ని అలాంటి అద్భుత స్క్రీన్ పై వీక్షించే సౌల‌భ్యం లేదు.

అవతార్ ట్రైలర్ విడుదలై ఇప్ప‌టికే అభిమానులకు ఇన్ స్టంట్ హైని ఇచ్చింది. దర్శకుడు జేమ్స్ కెమరూన్ తదుపరి స్థాయికి తీసుకెళ్లిన తీరు అభిమానులను కలవరపెడుతోంది. వీలైనంత త్వరగా సినిమా చూడాలనుకుంటున్నారు. ఈ చిత్రం 3Dలో అలాగే  IMAX 3డి ఫార్మాట్ లో విడుదల అవుతుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో IMAX స్క్రీన్ లేదు. హైద‌రాబాద్ ప్రసాద్స్ లోని పెద్ద స్క్రీన్ ఐమాక్స్ స్క్రీన్ గా ఉండేది. అయితే కోవిడ్ కారణంగా యజమానులు దానిని సాధారణ థియేటర్ గా మార్చారు. కాబట్టి తెలుగు అభిమానులకు ఈ చిత్రాన్ని కేవలం 3డి వెర్షన్ లో చూడటం తప్ప మరో మార్గం లేదు.

అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఒక విజువ‌ల్ వండ‌ర్ ని ఐమ్యాక్స్ స్క్రీన్ లో వీక్షించేందుకు ప్ర‌జ‌లు ఎంత డ‌బ్బు అయినా ఖ‌ర్చు చేయ‌డానికి వెన‌కాడ‌రు. కుటుంబ స‌మేతంగా ఐమ్యాక్స్ 3డి స్క్రీన్ లో సినిమా వీక్ష‌ణ‌కు వెళ్లే వారికి నిజంగానే రొటీన్ థియేట‌ర్ల‌లో 3డిలో చూసినా కానీ అవ‌తార్ 2తో ఆ అనుభూతి క‌లుగుతుందా? అన్న‌ది చెప్ప‌లేం. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ‌-తిరుప‌తి- వైజాగ్- రాజ‌మండ్రి లాంటి పెద్ద న‌గ‌రాల్లో ఐమ్యాక్స్ స్క్రీన్ లు నెల‌కొల్పే సామ‌ర్థ్యం మ‌న‌వాళ్ల‌కు ఉన్నా కానీ అలాంటి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేద‌నే చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.