Begin typing your search above and press return to search.

`వెంకీమామ‌`లో స‌ర్ ప్రైజ్ ట్రీట్ లేదే

By:  Tupaki Desk   |   14 Dec 2019 6:30 AM GMT
`వెంకీమామ‌`లో స‌ర్ ప్రైజ్ ట్రీట్ లేదే
X
విక్టరీ వెంక‌టేష్ - నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన `వెంకీమామ` ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. వెంకీ.. చైతూ న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిసినా సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ఈ సినిమాలో స‌ర్ ప్రైజ్ గెస్ట్ గా స‌మంత క‌నిపించ‌నున్నార‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది.

సామ్ పై ప‌హ‌ల్గామ్ (క‌శ్మీర్ )లో షూటింగ్ జ‌రిగింద‌ని `వెంకీమామ‌`లో కొన్ని సెక‌న్ల‌పాటు అయినా గెస్టుగా మెరుస్తుంద‌ని ప్ర‌చారం హోరెత్తింది. కానీ అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. స‌మంత‌ ఈ సినిమా ఎండ్ కార్డ్ ప‌డిన త‌ర్వాత‌నే చివ‌రిలో వేసిన తెర‌వెన‌క స‌న్నివేశాల్లో ఒక సెక‌ను పాటు మెరుపులా మెరిసింది త‌ప్ప అస‌లు మూవీ సీన్స్ లో ఎక్క‌డా క‌నిపించ‌నేలేదు.

అయితే చైతూ సినిమాలో సామ్ క‌నిపించ‌క‌పోవ‌డం అక్కినేని అభిమానుల‌కు నిరాశ‌నే మిగిల్చింది. ఇక స‌మంత క‌శ్మీర్ వెళ్ల‌డానికి కార‌ణం కేవ‌లం షూటింగ్ లొకేష‌న్ లో చైతో టైమ్ స్పెండ్ చేసేందుకు మాత్ర‌మే. ప‌నిలో ప‌నిగా అక్క‌డ ఓ ఫోటోషూట్ లో పాల్గొంద‌ని ఫ్యాన్స్ చెప్పుకున్నారు. అలాగే వ‌రుస‌గా ఫ్యామిలీ సినిమాల్లో అతిధి పాత్ర‌ల్లో క‌నిపిస్తే అది అంత బావుండ‌ద‌ని కూడా సామ్ భావిస్తోంద‌ట‌. ఇంత‌కుముందు మ‌న్మ‌ధుడు 2లో అతిధి పాత్ర‌లో మెరిసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప‌వ్వ‌డం నిరాశ‌ప‌రిచింది.