Begin typing your search above and press return to search.

ఐకానిక్ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పెట్టేశారా...?

By:  Tupaki Desk   |   10 Oct 2020 4:00 AM GMT
ఐకానిక్ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పెట్టేశారా...?
X
దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్ - కనబడుటలేదు' అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని గతేడాది బన్నీ బర్త్ డే నాడు వెల్లడించారు. అయితే అప్పటి నుంచి 'ఐకాన్' నుంచి మరో అప్డేట్ కనిపించలేదు. అదే సమయంలో బన్నీ మాత్రం 'అల వైకుంఠపురంలో' సినిమా కంప్లీట్ చేయడంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీని స్టార్ట్ చేసాడు. దీంతో 'ఐకాన్' అటకెక్కినట్లేనని కామెంట్స్ వినిపించాయి. అయితే సరిగ్గా ఏడాది తర్వాత బన్నీ బర్త్ డే సందర్భంగా 'ఐకాన్' పోస్టర్ తో విషెస్ చెప్పి ఈ ప్రాజెక్ట్ సజీవంగా ఉందని హింట్ ఇచ్చారు.

అయితే అల్లు అర్జున్ ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. దీంతో 'ఐకాన్' ఇక కనిపించకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకున్నారు. ఎప్ప‌టినుంచో దిల్ రాజు కాంపౌండ్ నుంచి చేస్తారంటూ ఊరిస్తున్న 'ఐకాన్' పూర్తిగా పక్కన పెట్టినట్లేనని ఇప్పుడు గీత కాంపౌండ్ టాక్ వినిపిస్తోంది. కాకపోతే 'ఐకాన్' ని బన్నీతో చేసే అవకాశాలు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని ఎలాగైనా మరో స్టార్ తో చేయాలని దిల్ రాజు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాతో బిజీగా ఉన్న వేణు శ్రీరామ్.. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే 'ఐకాన్' స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి వేరే హీరోలకు చెప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టారా లేదా వేరే హీరోతో ముందుకు తీసుకెళ్తారా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.