Begin typing your search above and press return to search.

ప్రభాస్ కొత్త మూవీలో 'క్లాసికల్ డాన్సర్' రోల్ ఉందా..?

By:  Tupaki Desk   |   16 Jun 2020 3:44 PM GMT
ప్రభాస్ కొత్త మూవీలో క్లాసికల్ డాన్సర్ రోల్ ఉందా..?
X
ప్రస్తుతం టాలీవుడ్ వెండితెర పై అందాల భామ పూజ హెగ్డే హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న పూజ ఇటీవలే తన స్పీడ్ పెంచేసింది. 'అరవింద సమేత', మహర్షిల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. అమ్మడి హవా ప్రస్తుతం ఊపు మీద ఉన్నట్లే అన్పిస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఉంది. కరోనా వైరస్ వలన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది.

"పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా మారిందట. త్వరలోనే తన క్లాసికల్ నృత్య కళ మొత్తం సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతోంది. దీనికోసం ఆమె 3 నెలల కిందటే ట్రయినింగ్ తీసుకుంది" అంటూ ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించి ఇలా రెండు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ పుకార్లపై ప్రభాస్ చిత్ర యూనిట్ స్పందించింది. ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే.. ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ కాదని తేల్చి చెప్పింది. 1960ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. కథకు తగ్గట్టు పూజా హెగ్డే కూడా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుందని సమాచారం. అయితే క్లాసికల్ డాన్సర్ పాత్ర మాత్రం లేదంటుంది యూనిట్. ఇక ఓవైపు ఈ సినిమాకు ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో అభిమానుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పూజా ఈ సినిమాతో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.