Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయరా...?

By:  Tupaki Desk   |   12 Oct 2020 12:10 PM GMT
విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయరా...?
X
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ పీరియాడిక్ లవ్ డ్రామా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఆనంద్‌ 'దొరసాని'కి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అందమైన ప్రేమకథ కూడా మిళితమై ఉంటుందని తెలుస్తోంది. 'విజిల్' 'చూసి చూడంగానే' 'జాను' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో వినోద్ అనంతోజు అనే ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. లాక్ డౌన్ లో అనౌన్స్ చేసిన ఈ సినిమా అప్పుడే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇంతవరకు 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రంపై ఇండస్ట్రీలో ఎలాంటి బజ్ క్రియేట్ అవలేదు. ఆనంద్ దేవరకొండ కెరీర్ కి ఎంతో కీలకమైన రెండో సినిమా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు పూర్తయిందో అనేది చాలామందికి తెలియలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా పేరు జనాల్లోకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ అని ఫస్ట్ సింగిల్ అని టీజర్ అని ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. సినిమా డైరెక్ట్ ఓటీటీ విడుదల అవుతున్నా జనాలకు రీచ్ అవ్వాలంటే మేకర్స్ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందులోనూ తమ్ముడు సినిమా కోసం విజయ్ దేవరకొండ కూడా తనవంతు ప్రచారం చేయాల్సి ఉంటుంది. మరి సినిమా విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండటంతో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.