Begin typing your search above and press return to search.

అందం ఉంది .. అదృష్టం కోసమే అన్వేషణ!

By:  Tupaki Desk   |   21 May 2021 10:00 AM IST
అందం ఉంది .. అదృష్టం కోసమే అన్వేషణ!
X
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు.

నాని హీరోగా చేసిన 'మజ్ను' సినిమా ద్వారా ఈ అమ్మాయి పరిచయమైంది. విశాలమైన కళ్లతో ఈ అమ్మాయి చేసిన విన్యాసాలకు కుర్రాళ్లంతా సంతోషంగా మనసులు సమర్పించేసుకుని థియేటర్లలో నుంచి బయటికి వచ్చారు. మరో సినిమా వచ్చేవరకు ఈ సినిమా చూస్తూ బతికేయాలనుకున్నారు. అంతగా ఈ సుందరి వాళ్ల మనసులను తన చూపులత్తో చుట్టేసింది .. తన గురించిన కలలకు కట్టేసింది.

అనూ గ్లామర్ కి యూత్ నుంచి మంచి మార్కులు పడటంతో, సహజంగానే ఆమెకి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.

ఏకంగా ఆమె పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ వంటి వారి సరసనే అవకాశాలను దక్కించుకుంది. కానీ ఇక్కడే అనూను అదృష్టం వెక్కిరించింది. ఈ రెండు సినిమాలు కూడా పరాజయాలను చవిచూశాయి. హిట్ ఫార్ములాతో వచ్చిన 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా ఆమెకు హిట్ ఇవ్వలేకపోయింది. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ పిల్ల 'అల్లుడు అదుర్స్' సినిమా చేసింది.

బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా ఈ అమ్మాయి చేసిన ఈ సినిమా, మాస్ హిట్ కొడుతుందని అంతా భావించారు. ఈ సినిమాతో మళ్లీ పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో 'మహా సముద్రం' ఒక్కటే ఉంది. ఆ తరువాత ఏ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమె పేరు వినిపించడం లేదు .. కనిపించడం లేదు. దాంతో ఈ అమ్మాయి అయోమయంలో పడిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. అందాలు పుష్కలంగా ఉన్న ఈ అమ్మాయికి అదృష్టం తోడైతే చాలు నిలదొక్కుకుంటుంది. కానీ ఈ అమ్మాయిని పట్టించుకోకుండా అదృష్టం ఎక్కడెక్కడ తిరుగుతుందో .. ఏంటో!