Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్' డిజిటల్ హక్కులకు అక్కడ భారీడిమాండ్..!

By:  Tupaki Desk   |   31 March 2021 9:30 AM GMT
ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులకు అక్కడ భారీడిమాండ్..!
X
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రౌద్రం రణం రుధిరం అనే కాప్షన్ తో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ లైఫ్ స్టోరీల నేపథ్యంలో తెరకెక్కుతుంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. జూన్ వరకు ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్ నడుస్తుంది. ఐతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఐతే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటినుండే సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ తో పాటు సాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ప్రయత్నం చేస్తోందని.. ఆర్ఆర్ఆర్ రైట్స్ కోసం ఎంతభారీ ధర అయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా బయటికి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.