Begin typing your search above and press return to search.

కంగ‌న‌..తాప్సీకి పోటీగా మ‌గాళ్లు లేరా!

By:  Tupaki Desk   |   10 Oct 2022 11:30 PM GMT
కంగ‌న‌..తాప్సీకి పోటీగా మ‌గాళ్లు లేరా!
X
బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్...సొట్ట‌బుగ్గ‌ల తాప్సీ డేరింగ్ అండ్ డ్యాషింగ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేన‌దు. విష‌యం ఏదైనా? మ‌క్కుసూటిగా మాట్లాడ‌టం ఇద్ద‌రి నైజం. ఒణుకు..బెణుకు ఇద్ద‌రి బ్ల‌డ్ లోనూ లేదు. వివాదం ఎలాంటిదైనా భామా మ‌ణులు ఇద్ద‌రు ఇచ్చే వివ‌ర‌ణ మాత్రం ప్ర‌త్య‌ర్ధికి గూబ గీయిమ‌నిపించేలా ఉంటుంది. ఈ విష‌యంలో కంగ‌న‌ని చూసి తాప్సీ మ‌రింత రాటు దేలింది.

టాలీవుడ్ లో ఉన్నంత కాలం కామ్ గోయింగ్ గాళ్ గా ఉన్న తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత త‌న‌లో ఛేంజ్ ఓవ‌ర్ చూసి అంతా షాక్ అయ్యారు.ఆ త‌ర్వాత అర్ధ‌మైంది అది ఛేంజోవ‌ర్ కాదు. తాప్సీ రియాల్టీ అని. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇటీవ‌లే కంగ‌న త‌మిళ‌నాడు దేవాల‌యాల మ‌ధురై ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాజ‌కీయాల గురించి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. మ‌ధురై నుంచే రంగంలోకి దిగుతాన‌ని వెల్ల‌డించింది. అప్ప‌టి నుంచి కంగ‌న మ‌రోసారి బాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ ని కుదిపేసిన భామ రాజ‌కీయాల్ని ఓ రేంజ్ లో కుదిపేస్తుందంటూ ప్ర‌శంసించిన వారు కొంద‌రైతే ..విమర్శించిన వారు మ‌రికొంద‌రు. తాజాగా కంగ‌న‌..తాప్సీ ల స‌త్తా గురించి బాలీవుడ్ న‌టి గుల్ ప‌నగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

కంగ‌న యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటుంద‌నే అనుకుంటున్నాను. బ‌హుశా తాప్సీ కూడా అదే చేసే అవ‌కాశం ఉంది. వారికి బ‌ధులుగా అంత‌టి దైర్యం చూపించిన మ‌గాళ్ల‌ని ఇంత వ‌ర‌కూ చూడ‌లేదు. అతి త్వ‌ర‌లోనే వారిద్ద‌రికి ఏం కావాలో వాళ్లే నిర్ణ‌యించుకుంటార‌ని ఆశిస్తున్నా. అలాగ‌ని కంగ‌న‌ని ప్ర‌తీ విష‌యంలో స‌మ‌ర్ధిస్తాను అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే.

ఆమె లో నాకు న‌చ్చ‌ని విష‌యాలు చాలా ఉన్నాయి. కానీ న‌చ్చే విష‌యంలో ఆమెలోని తెగింపు..ధైర్యం. చాలా తెలివైన అమ్మాయి. కంగ‌న‌లో చాలా క్వాలిటీలు మ‌ళ్లీ నాకు తాప్సీలోనే క‌నిపించాయి. కొంత కాలం త‌ర్వాత ఇద్ద‌రు క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు అని చెప్ప‌కొచ్చింది.

మొత్తానికి గుల్ ప‌న‌గ్ ఇద్ద‌రి గురించి బాగానే విశ్లేషించింది. ఇలా ఎనాల‌సిస్ చేసిందంటే గుల్ ప‌న‌గ్ ని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు సుమీ. ప్రస్తుతం ఈభామ సోనిలీవ్ ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ `గుడ్ బ్యాడ్ గ‌ర్ల్` లో న‌టిస్తోంది. దీనికి అభిషేక్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంకా అమ్మ‌డి చేతిలో ప‌లు సినిమాలున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.