Begin typing your search above and press return to search.

ఇండియాలో 40 ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి.. మీకు తెలుసా??

By:  Tupaki Desk   |   13 April 2020 5:49 PM GMT
ఇండియాలో 40 ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి.. మీకు తెలుసా??
X
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే పేరు విపరీతంగా వినబడుతోంది. అసలింతకీ ఓటీటీ అంటే ఏంటి? మనకు భారతదేశంలో ఎన్ని రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఓటీటీ అంటే 'ఓవర్ ది టాప్(OTT) మీడియా సర్వీసెస్'. ఇంటర్నెట్ ద్వారా సినిమాలను.. టీవీ చానల్స్ ను.. ఇతర అ కార్యక్రమాలను మన ఇంట్లో ఉండి చూసే సౌలభ్యం అన్నమాట. మరి ఇదే పని టీవీలతో ఇదివరకే చేస్తున్నాము కదా అంటే.. అది బ్రాడ్ కాస్టింగ్ కిందకు వస్తుంది. అంటే ఛానల్ వారికి తోచిన ప్రోగ్రాం.. వారి పైత్యాలను రంగరించి మనపై రుద్దే రసరమ్యమైన కార్యక్రమాలను మనం ఎగబడి చూడాలి. రెండు గంటల సినిమాకు మూడు గంటల యాడ్ల రుద్దుడుకి సిద్ధపడాలి. వారికి నచ్చిన.. వారి దగ్గర ఉన్న ఒకే సినిమాను కనీసం పదేళ్లు భరించాలి.

కానీ ఓటీటీ అలా కాదు. మనకు నచ్చిన సమయంలో మనకు నచ్చిన కార్యక్రమాలను.. సినిమాలను అందుబాటులో ఉన్న మెనూ నుంచి ఎంచుకొని చూడటమే. స్మార్ట్ టీవీ లో.. మన లాప్ టాప్ లో .. ట్యాబ్ లో.. ఫోన్ లో.. ఎందులోనైనా చూడొచ్చు. అయితే ఈ సౌలభ్యం వినియోగించుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

హై స్పీడ్ ఇంటర్నెట్.. స్మార్ట్ టీవీల పుణ్యమా అని ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇండియాలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా మనపై విధింపబడిన లాక్ డౌన్ దెబ్బకు ఓటిటి సబ్ క్రైబర్లు పదింతలయ్యారు. ప్రింటెడ్ న్యూస్ పేపర్ ను చూస్తే భయం.. న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ అనే రొడ్డ కొట్టుడు పదం కనబడితే చిరాకు.. వీటి దెబ్బకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏదో నచ్చిన ప్రోగ్రాం చూసుకుంటూ హాయిగానో.. బాధగానో కాలం గడుపుతున్నారు.

మనదేశంలో ఓటిటీ ప్లాట్ ఫామ్ లు మొత్తం 40 ఉన్నాయి. 2019లో ఈ ఓటీటీల టర్నోవర్ 3500 కోట్లు అని.. ఈ ఏడాది అది మూడు నాలుగు రెట్లు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime).. నెట్ ఫ్లిక్స్ (Netflix).. హాట్ స్టార్ (Hotstar).. జీ5(ZEE5).. సన్ నెక్స్ట్ (Sun NXT).. ఎం ఎక్స్ ప్లేయర్ (MX Player).. వూట్ (Voot).. ఆహా(Aha) లాంటివి దాదాపు అందరికీ తెలిసిన పేర్లు.

ఇవి కాకుండా ఇంకా చాలా ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. వాటిపై కూడా ఓ లుక్కేయండి. కింద ఉండే లిస్టు లో కొన్ని పేర్లు మీకు తెలిసి ఉండే అవకాశం ఉంది.

ప్రైమ్ ఫ్లిక్స్
హై ఫ్లిక్స్
స్మార్ట్ మల్టీప్లెక్స్
అడ్డా టైమ్స్
ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్
ఏ ఎల్ టి బాలాజీ
అరే
బిగ్ ఫ్లిక్స్
బాక్స్ టీవీ
డిట్టో టీవీ
ఎరోస్ నౌ
హోయ్ చోయ్
జియో సినిమా
జియో టీవీ
లైకా టీవీ
మనోరమ మ్యాక్స్
జెమ్ ప్లెక్స్
షీమారూ మీ
సోనీ లివ్
స్పూల్
ది వైరల్ ఫీవర్
ఉల్లు
వోడాఫోన్ ప్లే
ఫ్లిజ్ మూవీస్
వింటర్ సన్ టివి
మ్యావ్ ష్యాక్
హుక్
మూబి
వ్యూ
వ్యూ క్లిప్
యాప్ టీవీ
డిస్కవరీ +