Begin typing your search above and press return to search.

అప్పుడు జీరో.. ఇప్పుడు స్టార్ సెల‌బ్రిటీ!

By:  Tupaki Desk   |   23 Dec 2019 3:58 AM GMT
అప్పుడు జీరో.. ఇప్పుడు స్టార్ సెల‌బ్రిటీ!
X
టైమ్ అనేది ప్ర‌తిదీ ఛేంజ్ చేస్తుంటుంది. ఫేట్ ఓవ‌ర్ నైట్ మారిపోయినా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ర్లేదు. కాలం ఎవ‌రిని ఎప్పుడు అంద‌లం ఎక్కిస్తుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌కొండ జీవితం లో జ‌రిగింది అదే. మూడున్న‌రేళ్ల క్రితం సెల‌బ్రిటీ ప్ర‌పంచం లో అత‌నో జీరో. అప్పుడే హీరో గా బుడిబుడి న‌డ‌క‌లు వేస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌- ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రాల్లో న‌టించినా విజ‌య్ కి హీరోగా ఆశించినంత స్టార్ డ‌మ్ వ‌చ్చేయ‌లేదు. ప్ర‌యాణం మొద‌లు పెట్టి మూడున్న‌రేళ్ల త‌ర్వాత‌ `పెళ్లిచూపులు` చిత్రం తో ద‌శ తిరిగింది. సైలెంట్ గా ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విజ‌య్ కి సోలో హీరోగా మంచి గుర్తింపును తెచ్చింది. బోయ్ నెక్ట్స్ డోర్ అన్న‌ ఇమేజ్ వ‌చ్చింది.

ఇక విజ‌య్ త‌న ఫేవ‌రెట్ సీఎం చేతుల‌ మీదుగా నేడు పుర‌స్కారాన్ని అందుకోవ‌డం ఒక సెన్సేష‌న్. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డుని అందుకున్న సంద‌ర్భం గా టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సోష‌ల్ మీడియా వేదిక‌గా పలు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ప్ర‌ముఖ టెలివిజ‌న్ సంస్థ ఆదివారం `న‌వ న‌క్ష‌త్ర స‌న్మానం` చేసింది. ఈ కార్య‌క్ర‌మం లో ఇదిగో ఇలా అవార్డును అందుకున్నారు.

అనంత‌రం సోష‌ల్ మీడియా లో ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. `మూడున్న‌రేళ్ల క్రితం నేను ఎవ‌రిని? . పెళ్లిచూపులు సినిమా తో ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు అనంత‌మైన అవ‌కాశాలు.. వ‌చ్చే ఏడాది ఏం జ‌ర‌గబోతోందో చూద్దాం... అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. విజ‌య్ ఇన్ స్టాలో పెట్టిన ఈ పోస్ట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.