Begin typing your search above and press return to search.
అప్పుడు క్రిష్‌ను ఆడుకుంది.. ఇప్పుడు అతణ్ని
By: Tupaki Desk | 7 Dec 2020 8:00 AM ISTగమ్యం, కంచె లాంటి సినిమాలతో తెలుగులో గొప్ప పేరు సంపాదించిన దర్శకుడు క్రిష్. అతడికి బాలీవుడ్లో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడ తీసిన తొలి సినిమా ‘గబ్బర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. రెండో సినిమా ‘మణికర్ణిక’ బాగా ఆడినా ఆ క్రెడిట్ అతడికి దక్కలేదు. క్రిష్ సినిమా అంతా పూర్తి చేశాక కథానాయిక కంగనా రనౌత్ రంగంలోకి దిగి ఎడిటింగ్ మొదలుపెట్టడం.. కొన్ని సన్నివేశాలు తీసి పక్కన పడేసి స్వీయ దర్శకత్వంలో కొన్ని సీన్స్ రీషూట్ చేయడం.. అది క్రిష్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించడం తెలిసిన సంగతే. దీని గురించి ‘మణికర్ణిక’ విడుదల సమయంలో పెద్ద రచ్చే జరిగింది. కంగనా తీరును చాలామంది తప్పుబట్టారు. కానీ అవేమీ ఆమె పట్టించుకోలేదు. తానేం చేయాలనుకుంటే అది చేసింది. క్రిష్ లాంటి మంచి దర్శకుడితో కంగనా వ్యవహరించిన తీరు చూశాక చాలామంది దర్శకులు ఆమెతో పని చేయడానికి సందేహించారు.
ఐతే తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ మాత్రం జయలలిత పాత్ర చేయడానికి ఇక్కడెవరూ లేనట్లు ఏరి కోరి కంగనాను ఎంచుకున్నాడు. ఆ పాత్రకు ఆమె ఎలా సెట్టవుతుందో చాలామందికి అర్థం కాలేదు. అయినా సరే.. ఏదో మేనేజ్ చేసి కంగనాతో జయ పాత్రను చేయించారు. ‘తలైవి’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ అనుకుంటున్నారు. ఐతే ఇప్పుడు కంగనా తనలోని మరో యాంగిల్‌ను బయటికి తీసినట్లు సమాచారం. ఆమె ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుందట. తనకు నచ్చినట్లుగా కటింగ్స్, అడిషన్స్ చేస్తోందట. ఏ పాత్ర నిడివి ఎంత ఉండాలి.. ఏ సన్నివేశాలు ఉండాలి.. ఏవి కోత వేయాలి అన్నది ఆమెనే నిర్ణయిస్తోందట. ఈ విషయంలో కంగనాతో ఎలా డీల్ చేయాలో దర్శక నిర్మాతలకు అర్థం కావట్లేదట. విజయ్‌కి ఆమె తీరు ఎంతమాత్రం నచ్చట్లేదని, కానీ ఏం చేయలేక ఊరుకున్నాడని కోలీవుడ్‌లో డిస్కషన్లు నడుస్తున్నాయి. కంగనా కథంతా తెలిసి కూడా ఆమెను జయ పాత్రకు ఎంచుకున్నందుకు ఫలితం ఇది అంటూ ‘తలైవి’ దర్శక నిర్మాతలపై సెటైర్లు పడుతున్నాయి కోలీవుడ్ వర్గాల్లో.