Begin typing your search above and press return to search.

నిన్న క‌ఠారికృష్ణ‌.. ఇప్ప‌డు రాజ‌ప్ప సేమ్ టు సేమ్‌!

By:  Tupaki Desk   |   14 July 2022 6:49 AM GMT
నిన్న క‌ఠారికృష్ణ‌.. ఇప్ప‌డు రాజ‌ప్ప సేమ్ టు సేమ్‌!
X
ప్ర‌కాష్ రాజ్ త‌రువాత టాలీవుడ్ లో విల‌న్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్నారు త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖని..అల వైకుఃఠ‌పుర‌ములో చిత్రంలో భిన్న‌మైన మేన‌రిజ‌మ్ వున్న అప్ప‌ల‌నాయుడుగా, క్రాక్ లో క‌ఠారి కృష్ణ‌గా, 'స‌ర్కారు వారి పాట‌'లో రాజేంద్ర‌నాథ్ గా క‌నిపించారు. పాత్ర‌ల గెట‌ప్ లు మారుతున్నా పాత్ర‌ల స్వ‌భావం, న‌ట‌న ఓకే ర‌కంగా వుంటూ బోర్ కొట్టిస్తున్నాడు. ఇదిలా వుంటే స‌ముద్ర‌ఖ‌ని మ‌రో సారి విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'.

పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో నితిన్ హీరోగా న‌టిస్తున్నారు. నితిన్ కెరీర్ లోనే భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్ ఎం.ఎస్. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిశెట్టి, కేథ‌రిన్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ ఆగ‌స్టు 12న వ‌ర‌ల్ట్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా ఇటీవ‌లే ఫ‌స్ట్ ఎటాక్ పేరుతో టీజ‌ర్ ని విడుద‌ల చేసింది.

తాజాగా అంజ‌లి, నితిన్ ల‌పై జాత‌ర నేప‌థ్యంలో చిత్రీక‌రించిన 'రారా రెడ్డి.. ఐ యామ్‌' రెడీ అంటూ సాగే పెప్పీ ఐట‌మ్ నంబ‌ర్ ని విడుద‌ల చేశారు. పాట చివ‌రలో 'జ‌యం' సినిమాలోని రాను రానంటూనే చిన్న‌దో ' అంటూ సాగే బీట్ ని యాడ్ చేశారు. దీంతో ఈ పాట నెట్టింట వైర‌ల్ అవుతోంది. పైగా ఈ పాట‌లో అంజ‌లి అందాలు, నితిన్ మాసీవ్ స్టెప్పులతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదిలా వుంటే ఈ మూవీలో స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. గురువారం స‌ముద్ర‌ఖ‌ని పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

ఇందులో స‌ముద్ర‌ఖ‌ని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజ‌ప్ప‌గా క‌నిపించ‌బోతున్నారు. సిల్వ‌ర్ క‌ల‌ర్ లో నెరిసిన జుట్టు, మెలితిప్పిన మీసం.. నుదుటిన తిల‌కం. మెడ‌లో కుద్రాక్ష మాల.. పేప‌ర్ల‌పై సంత‌కం చేస్తూ సీరియ‌స్ లుక్ లో స‌ముద్రఖ‌ని క‌నిపిస్తున్నారు.

అల వైకుంఠ‌పుర‌ములో,'క్రాక్‌' వంటి చిత్రాల్లో పోషించిన క‌రుడు గ‌ట్టి విల‌న్ పాత్ర‌లానే ఈ పాత్ర కూడా వున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. పాత్ర పేరు మారుతున్నా స‌ముద్ర‌ఖ‌ని విల‌న్ పాత్ర‌ల్లో కొత్త‌ద‌రం చూపించ‌లేక‌పోతున్నాడు.

పొలిటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం ' మూవీ ఆగ‌స్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని పోషించిన రాజ‌ప్ప పాత్ర ఎప్ప‌టిలాగే రోటిన్ గా వుంటుందా? లేదంటే కొత్త‌గా ట్రై చేశాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.ఈ చిత్రంలో హీరో నితిన్ క‌లెక్ట‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీ స‌క్సెస్ నితిన్ కు కీల‌కంగా మారింది.