Begin typing your search above and press return to search.
అప్పుడు బన్నీతో అన్నారు.. ఇప్పుడు నాగ్ తో అంటున్నారే...!
By: Tupaki Desk | 13 Sept 2020 3:00 PM IST'విలేజ్ లో వినాయకుడు' 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మహి వి. రాఘవ్.. 'పాఠశాల' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ కామెడీ 'ఆనందో బ్రహ్మ' తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని పాదయాత్రను ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే సక్సెసఫుల్ సినిమా తీశాడు. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాఘవ్ ఫ్యూచర్ లో 'యాత్ర 2' కూడా తీస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహి వి. రాఘవ్ తదుపరి ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
కాగా ఈ మధ్య అల్లు అర్జున్ తో మహి వి. రాఘవ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని హీరో పాత్ర డిజైన్ చేసారని.. సీఎంగా ప్రజాసంక్షేమానికి పాటు పడే ఆ క్యారక్టర్ కి కమర్షియాలిటీ జోడించి ఈ సినిమాని రూపొందిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో రాఘవ్ తదుపరి సినిమా పై మరో న్యూస్ వస్తోంది. 'కింగ్' అక్కినేని నాగార్జునతో రాఘవ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. మహి చెప్పిన స్టోరీ లైన్ నాగార్జునకు బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ పై ఫోకస్ పెట్టమని నాగ్ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.