Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్: తెల్ల‌వారితే గురువారం.. వ‌ధువు వెయిటింగ్.. కానీ!!

By:  Tupaki Desk   |   21 March 2021 4:00 PM GMT
ట్రైల‌ర్ టాక్: తెల్ల‌వారితే గురువారం.. వ‌ధువు వెయిటింగ్.. కానీ!!
X
ఎం.ఎం.కీర‌వాణి వార‌సుడు శ్రీ‌సింహా కోడూరి `మ‌త్తువ‌ద‌ల‌రా` సినిమాతో 2019లో హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి ప్ర‌య‌త్న‌మే న‌టుడిగా ఆక‌ట్టుకున్నాడు. `మ‌త్తు వ‌ద‌ల‌రా` చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యం సాధించింది.

ప్ర‌స్తుతం శ్రీ‌సింహా న‌టిస్తున్న రెండో సినిమా `తెల్లవారితే గురువారం` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా ప్రీరిలీజ్ వేడుక‌లో ట్రైల‌ర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆస‌క్తిక‌ర మ‌లుపుల‌తో ఆక‌ట్టుకుంది. తెల్ల‌వారితే పెళ్లి .. వ‌ధువు తండ్రి రాజీవ్ క‌న‌కాల ముఖంలో ఆ బాధ చూస్తుంటే ఇందులో ఎంత పెద్ద మెలోడ్రామా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక అజ‌య్ శేషు గాడి పెళ్లాం! అంటూ సీరియ‌స్ గా హీరో శ్రీ‌సింహాతో ఆడేసుకుంటున్నాడు. అంటే ఇందులో పెళ్లి కూతురు చుట్టూ మ‌తి చెడే కాన్ ఫ్లిక్ట్ తో ర‌క్తి క‌ట్టించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

పెళ్లి సంబంధాలు వ‌ద్ద‌నుకునే యువ ప్రేమికుడిగా శ్రీ సింహా కొడూరి ఇందులో న‌టిస్తున్నారు. క‌థానాయిక‌తో ల‌వ్ రొమాన్స్ సీన్స్ లో అత‌డి హావ‌భావాలు బావున్నాయి. తొలి సినిమాలో కాస్త డీగ్లామ‌ర‌స్ పాత్ర‌లో క‌నిపించిన అత‌డు ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా స్మార్ట్ గానూ క‌నిపిస్తున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల‌తో రాజ‌మౌళి కాంపౌండ్ నుంచి ఈ యంగ్ హీరో షైన్ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. క‌థానాయిక‌లు మిషి- చిత్ర శుక్ల అంద‌చందాల‌తో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇద్ద‌రు మ‌గువ‌ల న‌డుమ హీరోగారి కాన్ ఫ్లిక్ట్ ఏమిట‌న్న‌ది తెరపైనే చూడాల్సి ఉంటుంది. అలాగే ఇందులో స‌త్య కామెడీ ఆక‌ట్టుకుంటోంది.

ఇంత‌కుముందు పోస్ట‌ర్ల‌తోనే తెల్లవారితే గురువారం ఆద్యంతం ఫ‌న్ ల‌వ్ ఎలిమెంట్స్ తో సాగే చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్థ‌మైంది. ఇప్పుడు ట్రైల‌ర్ తో సినిమా ఫ్యామిలీ ఆడియెన్ కోసం వ‌స్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవీంద్ర బెనర్జీ ముప్పనేని - రజిని కొర్రపాటి ‌సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌త్తు వ‌ద‌ల‌రా కి అద్భుత‌మైన ఆర్.ఆర్... సంగీతం అందించిన క‌థానాయకుడి సోద‌రుడు కాల భైర‌వ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు.