Begin typing your search above and press return to search.

బాలయ్య ఇంటికే కన్నం ప్లానేసాడే!!

By:  Tupaki Desk   |   28 Sept 2018 1:56 PM IST
బాలయ్య ఇంటికే కన్నం ప్లానేసాడే!!
X
పోలీస్ ఆఫీసర్ గా నందమూరి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్ పెక్టర్ సినిమా అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. పవర్ ఫుల్ పోలీస్ గా రౌడీలకు గుండాలకు దడ పుట్టించే పాత్రలో ఆయన యాక్షన్ కి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. అది సినిమా కాబట్టి నిజం అయ్యే అవకాశం లేదు నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకున్నాడో దొంగ. ఏకంగా బాలయ్య ఇంట్లోనే దొంగతనానికి స్కెచ్ వేసాడు. కాకపోతే జులాయిలో బ్రహ్మానందంలాగా అది చేయడానికి ముందే దొరికిపోయాడు.

ఇటీవలే బెంగళూరులో సత్తిబాబు అనే వరసగా చోరీలు చేసే సీరియల్ దొంగ పట్టుబడ్డాడు. అతనికి బుజ్జి అనే పేరు కూడా ఉంది. క్రైమ్ సర్కిల్స్ లో ఇతగాడు కర్రి రాజేష్ పేరుతో పాపులర్. విచారణలో భాగంగా గతంలో ఎక్కడెక్కడ దొంగతనాలు చేసాడు అని కనుక్కుంటుండగా ఏకంగా అతని ఫ్యూచర్ ప్లాన్ తెలిసేసరికి షాక్ తినడం పోలీసుల వంతైంది. పట్టుబడిన ఈ ఘరానా దొంగ ప్లాన్ చేసింది జూబ్లీ హిల్స్ లో బాలకృష్ణ ఇంటికేనట. ఇప్పుడు కనక దొరక్కపోయి ఉంటే అదే చేసేవాడిని అని ఒప్పేసుకున్నాడు.

ఎందుకిలా చేసావ్ అంటే పెద్ద హీరో కాబట్టి ఆయనింట్లో చోరీ చేస్తే సొత్తుతో పాటు భారీ పబ్లిసిటీ దక్కుతుందనే ఆశతో ప్లాన్ చేసుకున్నాడట. దొరకకపోతే అన్నంత పని చేసేలా ఉన్నాడే అని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. గతంలో కూడా జంట నగరాల్లో చాలా దొంగతనాలు చేసిన ఈ రాజేష్ సినిమా స్టార్ల జోలికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. బోణీ బాలయ్య ఇంటితో చేద్దాం అనుకున్నాడు కానీ ఫైనల్ గా ఇలా తేడా కొట్టేసింది.