Begin typing your search above and press return to search.

దసరాకు బొమ్మ పడటం కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   12 Sept 2020 2:01 PM IST
దసరాకు బొమ్మ పడటం కన్ఫర్మ్‌
X
కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు పూర్తిగా మూతబడి ఉన్నాయి. లాక్‌ డౌన్‌ ను దశల వారిగా ఎత్తివేస్తున్న కేంద్ర ప్రభుత్వం థియేటర్ల విషయంలో మాత్రం నాన్చుతూ వస్తుంది. థియేటర్లు ఓపెన్‌ చేయడం వల్ల చాలా ప్రమాదంగా కేంద్రం భావిస్తుంది. థియేటర్లలో సామాజిక దూరం అసాధ్యం. అక్కడ కరోనా నియంత్రణ చర్యలు ఏ స్థాయిలో తీసుకుంటారో చెప్పలేం. కనుక మరికొంత కాలం థియేటర్లను మూసే ఉంచాలని భావించారు. ఈ ఏడాది చివరి వరకు థియేటర్లకు లాక్‌ ఉంచాల్సిందే అనుకున్నప్పటికి దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లు మల్టీ ప్లెక్స్‌ ల యాజమాన్య సంఘాల వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.

వారి ప్రయత్నం ఫలించింది. జాగ్రత్తలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చి మహమ్మారి కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకుంటామంటూ పేర్కొంటూ అన్‌ లాక్‌ కు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి అన్‌ లాక్‌ లో థియేటర్లకు ఛాన్స్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దసరా సీజన్‌ కు థియేటర్లు ఓపెన్‌ అవ్వడం ఖాయం. అయితే ప్రేక్షకులు ఎంత మేరకు వస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీస్‌ గతంలో మాదిరిగా థియేటర్లకు మల్టీ ప్లెక్స్‌ లకు క్యూ కట్టడం అసాధ్యం.

కరోనా భయం నూరు శాతం పోతేనే థియేటర్లకు వెళ్లాలని చాలా మంది అనుకుంటున్నారు. ప్రజలు ఇప్పటికే ఆ నిర్ణయానికి వచ్చారు.. ప్రజల్లో అవగాహణ పెరిగింది కనుక కేంద్రం థియేటర్ల అన్‌ లాక్‌ కు నిర్ణయం తీసుకునే రోజు దగ్గకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వారం లేదా వచ్చే వారంలో థియేటర్ల అన్‌ లాక్‌ కు గైడ్‌ లైన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా థియేటర్లను ఈ నెలాఖరు వరకు రెడీ చేసుకుని అక్టోబర్‌ 1 నుండి బొమ్మ వేసే అవకాశాలు ఉన్నాయి.