Begin typing your search above and press return to search.

బెనిఫిట్ షో వేశార‌ని `అఖండ` థియేట‌ర్ సీజ్

By:  Tupaki Desk   |   2 Dec 2021 1:31 PM GMT
బెనిఫిట్ షో వేశార‌ని `అఖండ` థియేట‌ర్ సీజ్
X
కృష్ణా జిల్లా మైల‌వ‌రంలో అఖండ ఆడుతున్న థియేట‌ర్ లో సినిమాని నిలిపివేశారు. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా తెల్ల‌వారుఝామున సంఘ‌మిత్ర థియేట‌ర్ లో బెనిఫిట్ షో వేశార‌ని థియేట‌ర్ ని ఎమ్మార్వో సీజ్ చేశారు. కేసులు పెడ‌తామ‌ని తెలిపారు.

రెండు స్క్రీన్ల‌లో రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ని సీజ్ చేశామ‌ని.. మ‌రో స్క్రీన్ ని య‌థాత‌థంగా ర‌న్ అవుతోంద‌ని అధికారులు తెలిపారు. రోజుకు నాలుగు షోల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం అనుమ‌తి ఉంద‌ని వెల్ల‌డించారు.

ఏపీలో బెనిఫిట్ షోలు.. అద‌న‌పు షోల‌కు అనుమ‌తుల్లేవ్. తెలంగాణ‌లో మాత్ర‌మే అనుమ‌తులున్నాయి. ఇక ఏపీలో అద‌న‌పు షోల‌కు ఆస్కారం లేద‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్ర‌భుత్వ పోర్ట‌ల్ లోనే టిక్కెట్ల అమ్మ‌కం కొనుగోళ్లు సాగుతాయ‌ని వెల్ల‌డించారు.