Begin typing your search above and press return to search.
అక్టోబర్ 15న వచ్చేది పాత సినిమాలేనా?
By: Tupaki Desk | 5 Oct 2020 11:30 AM ISTకరోనా లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు మూత బడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు తెరుచుకోబోతున్నారు. ఈనెల 15వ తారీకు నుండి థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చుఅంటూ కొన్ని మార్గదర్శకాలను ఇచ్చి మరీ కేంద్రం అనుమతులు ఇచ్చింది. కేంద్రం నుండి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే థియేటర్ల యాజమాన్యాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాయి. తెలంగాణ మరియు ఏపీ ల్లో ఉన్న థియేటర్లు మరియు మల్టీ ప్లెక్స్ లు రెడీ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మార్గదర్శకాలతో సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. దాంతో థియేటర్లు రీ ఓపెన్ అయిన వెంటనే విడుదల అయ్యే సినిమాలు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పెద్ద సినిమాలు అయితే వెంటనే విడుదలకు సిద్దంగా లేవు. చిన్న సినిమాలను విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు వస్తారో రారో తెలియదు. దాదాపు అందరు ఫిల్మ్ మేకర్స్ కూడా కొన్ని రోజుల తర్వాత పరిస్థితులను బట్టి సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న విడుదల చేసేందుకు 'వి' మరియు 'నిశబ్దం' సినిమాలను విడుదల చేస్తున్నారు. అమెజాన్ వారు మరియు నిర్మాతలు కలిసి థియేటర్ల విడుదల విషయమై చర్చలు జరిపారు.
ఈ రెండు సినిమాలు అక్టోబర్ 15న థియేటర్లు ఓపెన్ అయితే అదే రోజున ప్రదర్శణకు సిద్దంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. మల్టీ ప్లెక్స్ వారు ఈ సినిమాల విడుదల విషయంలో ఆసక్తిగా లేరని కాని థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఈ రెండు సినిమాల ఎగ్జిబిట్ కు ఓకే చెప్పారట. ఇవి కాకుండా మరికొన్ని పాత సినిమాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. దసరాకు అయినా కొత్త సినిమాలు వస్తాయా అనేది చూడాలి.