Begin typing your search above and press return to search.
సినిమా హాళ్లు తెరవమన్నా తెరవమని తెగేశారు
By: Tupaki Desk | 30 July 2020 9:45 AM ISTఅన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదలైన సంగతి తెలిసిందే. నాలుగు నెలలుగా మూతపడి ఉన్న థియేటర్లను ఆగస్టు నుంచి అయినా తెరిచేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తుందనే భావించారు. దీనిపై సినీపరిశ్రమల్లో ఆసక్తిగానే వేచి చూశారు. కానీ అనూహ్యంగా మహమ్మారీ విజృంభణ అంతకంతకు పెరుగుతుండడంతో ఈసారి కూడా థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇవ్వలేదు. కేవలం జిమ్ లు మాత్రమే తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చారు. జన సమూహాలు పోగయ్యేందుకు ఆస్కారం ఉన్న దేనికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో అనుమతులు ఇవ్వలేదు.
దీంతో మరోసారి నిరాశ తప్పలేదు. ఒకవేళ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చి ఉంటే తెరిచేవారా? అంటే .. అందుకు పలువురు సీనియర్ నిర్మాతలు ఎగ్జిబిటర్లు చెబుతున్నది ఒక్కటే. ఇప్పుడున్న సీన్ లో థియేటర్లు తెరిచే ఛాన్సే లేదనేది వారి మాట. ఇటీవల సమీక్ష సమావేశాల్లో తేల్చినది ఏమిటి? అంటే.. ఇప్పట్లో థియేటర్స్ తెరిచే ఛాన్స్ లేదు..! ఎందుకంటే స్వయంగా నిర్మాతల మండలి సహా గిల్డ్ వారి ప్రతిపాదన ఇది. వాక్సిన్ లేదా టీకా వచ్చే వరకు థియేటర్స్ తెరవద్దు అని ప్రభుత్వానికే నిర్మాతలు సూచనలు పంపించారు అని తెలిసింది.
ఎందుకంటే థియేటర్స్ తెరిచినా జనాలు పొరపాటున అయినా రారు!! అని చాలా మంది నిర్మాతలు నమ్ముతున్నారు. అందువల్ల థియేటర్స్ తెరిస్తే సినిమాలు వేద్దాం అనుకున్న చాలా మంది నిర్మాతలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఎవరూ తెలిసి తెలిసి నష్టానికి రిలీజ్ చేయరు కదా? అన్న చర్చా సాగుతోంది. కేవలం 25-50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరిస్తే తీవ్ర నష్టాలు తప్పదని సీనియర్ ఎగ్జిబిటర్ కం నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ థియేటర్లు తెరిచినా కేవలం 50శాతం సిట్టింగ్ కే అనుమతులిచ్చే ఛాన్సుంది. కానీ దానివల్ల లాభాలేమీ ఉండవనేది ఎగ్జిబిటర్ వెర్షన్.