Begin typing your search above and press return to search.
ఆగస్టులో థియేటర్లు తెరుచుకోండి.. కేంద్రం బిగ్ జోక్!
By: Tupaki Desk | 25 July 2020 9:45 AM ISTప్రపంచవ్యాప్తంగా మహమ్మారీ విజృంభణ ప్రత్యక్షంగా చూస్తున్నదే. ఇండియాలో వైరస్ విలయతాండవం గురించి చెప్పాల్సిన పనే లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు స్కైని టచ్ చేస్తోంది. వందల నుంచి నంబర్ వేలకు పెరిగింది. ఇకపై రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. తాజా పరిణామంతో ప్రజలంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జనసమూహాల్లోకి వెళ్లాలంటేనే గజగజ ఒణుకుతున్నారు.
సరిగ్గా ఇలాంటి సమయంలో కేంద్రం ప్రకటన విన్న వాళ్లు అదేదో జోక్ చేసినట్టుగా ఫీలవుతున్నారు మరి. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను ఆగస్టులో తిరిగి తెరవడానికి అనుమతించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఐ అండ్ బి కార్యదర్శి అమిత్ ఖరే శుక్రవారం సిఐఐ మీడియా కమిటీతో సంభాషణలో ఈ విషయాన్ని సూచించారు. హోం మంత్రిత్వ శాఖ పూర్తిగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఆగస్టు 1 లేదా 31 తేదీ మధ్యలో ఎప్పుడైనా దేశం అంతటా థియేటర్లు తెరవడానికి అనుమతించాలని తాను సిఫార్సు చేశానని ఖరే చెప్పారు. అంతేకాదు దీనికి కొన్ని రూల్స్ ని ప్రతిపాదించారట. దాని ప్రకారం.. మొదటి వరుసలో సీటుకి సీటుకి మధ్య గ్యాప్.. తరువాత వరుసను ఖాళీగా ఉంచడం వగైరా పద్ధతిని అనుసరించాలి. అలాగే రెండు మీటర్ల సామాజిక దూర ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సూచించారట.
ఆయన ఎంతో గొప్పగానే సూచించారు కానీ.. దీనివల్ల థియేటర్ యజమానులకు ఒరిగేదేమీ కనిపించలేదని ఇటు టాలీవుడ్ సినీపెద్దలు విశ్లేషిస్తున్నారు. మార్గదర్శకాల్ని పాటించి చూపించేది సినిమానే కాదు. వినోదం అన్నది చిలౌట్ మూవ్ మెంట్. రిస్ట్రిక్షన్లతో చూసేది కాదు. పైగా 25శాతం జనాలతో థియేటర్లను నడిపించాలంటే తీవ్ర మూల్యం చెల్లించక తప్పదని విశ్లేషిస్తున్నారు. దానికంటే థియేటర్లను మూసివేయడం అత్యుత్తమమని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో సోనీ-మాడిసన్- డిస్కవరీ- అమెజాన్ ప్రైమ్- ట్విట్టర్ -బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్- స్టార్ అండ్ డిస్నీ- సీఐఐ మీడియా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొని ముచ్చటించారు.