Begin typing your search above and press return to search.

10 రిలీజ్ లకు థియేట‌ర్ల క‌ష్టాలు!!

By:  Tupaki Desk   |   19 Jun 2019 5:33 AM GMT
10 రిలీజ్ లకు థియేట‌ర్ల క‌ష్టాలు!!
X
ప్ర‌తి శుక్ర‌వారం రెండు మూడు రిలీజ్ లు చూస్తున్న‌దే. అయితే ఈసారి మాత్రం ఏకంగా 10 సినిమాలు థియేట‌ర్ల కోసం పోటీప‌డుతుండ‌డం ఫిలిం వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌- ఓట‌ర్- మ‌ల్లేశం- స్టూవ‌ర్డ్ పురం-గజేంద్రుడు- ఫ‌స్ట్ ర్యాంక్ రాజు-స్పెష‌ల్ .. వీటితో పాటు మ‌రో మూడు సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. అయితే వీట‌న్నిటికీ ప్రైమ్ ఏరియాల్లో మంచి థియేట‌ర్లు దొరుకుతాయా? ప‌ది సినిమాలు ఒకేసారి థియేట‌ర్ల‌ను షేర్ చేసుకుంటే క‌లిగే న‌ష్టం ఏమిటి? అంటే.. ఓ ప్ర‌ముఖ నిర్మాత విశ్లేష‌ణ ఇది.

మీకు నచ్చిన సినిమా తీయటం మీ ఇష్టం.. కానీ నచ్చిన తేదీకి రేలీజ్ చేయటం మీ ఇష్టం కాదు. థియేటర్స్ లేవని తెలిసి కూడా 21 వ తేదీన 10 సినిమాలు తేదీల‌తో రిలీజ్ ని ప్ర‌క‌టించేశారు. చాలా మంది సినిమాని బయటికి తేవడానికి చూస్తున్నారు కానీ సినిమా ర‌న్నింగ్ కోసం థియేటర్స్ సంపాదించడం ఎంత కష్టమో ఆలోచిస్తే మంచిది. ఒకేసారి 5 సినిమాలు కంటే ఎక్కువ రిలీజ్ చేస్తే కొన్ని థియేటర్స్ దొరకక రిలీజ్ చేయ‌లేక అలా ఉండిపోతాయి. ఆ తరువాత రిలీజ్ చేసుకోడానికి ఒకసారి తేదీ వేశాక పోస్ట్ పోన్ అయితే రిలీజ్ కూడా కష్టమే. ఇన్ని విషయాలు రిలీజ్ తేదీ ప్ర‌క‌టించేప్పుడు నిర్మాత‌లు ఆలోచించాలి.

మ‌హర్షి ఈనెల 28 నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. కిల్ల‌ర్.. గేమ్ ఓవ‌ర్.. వజ్రకవచదర గోవింద‌, హిప్పీ చిత్రాలు థియేట‌ర్ల‌లో కంటిన్యూ అవుతున్నాయి. ఈ సినిమాలు తీసేసి వేరే సినిమాలు వేసే పరిస్థితి లో థియేటర్స్ వాళ్లు లేరు. ఎందుకు అంటే వచ్చే సినిమాలు మీద వాళ్ళకి అస్స‌లు నమ్మకం లేదు. ఇక వ‌స్తున్న ప‌ది సినిమాల్లో .. థియేట‌ర్ల ప‌రంగా ప్రీప్లాన్డ్ గా ఉన్న‌వాళ్లు కొంద‌రున్నారు. ఫస్ట్ రాంక్ రాజు- ఏజెంట్ ఆత్రేయ- ఓటర్- సినిమాలకు థియేటర్స్ ముందుగానే బుక్ అయిపోయాయి. మ‌ల్లేశం- హిందీ అర్జునరెడ్డి సురేష్ మూవీస్ ద్వారా విడుదలవుతున్నాయి. మిగతా సినిమాల పొజిష‌న్ ఏమిటో అర్ధం కాని పరిస్థితి ఉంది. 21 న విడుదల అయిన తరువాత.. టాక్ బాగుంటే 22 నుంచి థియేటర్స్ ఇవ్వాల‌ని ఎగ్జిబిట‌ర్లు చూస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై అవగాహన లేకుండా తేదీలు ప్ర‌క‌టించి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి స‌న్నివేశంలో ఏం చేస్తే ప‌రిష్కారం? అంటే చిన్న‌ సినిమాలు 30/40 థియేటర్స్ మాత్రమే విడుదల చేసి రిపోర్ట్ ని బట్టి.. శనివారం నుంచి పెంచుకుంటే బాగుంటుంది.

ఓ ప్ర‌ముఖ నిర్మాత థియేట‌ర్ స‌మ‌స్య గురించి మాట్లాడుతూ త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ ఇచ్చారు. ఉదాహరణకు.. 2018 లో 168 సినిమాలు విడుదలయితే అందులో 18 హిట్లు...10 సేఫ్ సినిమాలు.. మిగిలిన 140 సినిమాలకు నైజాం లో ఏ సినిమాకి నిర్మాత/ డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక రూపాయి కూడా షేర్ రాలేదు. ఎదురు ఇక్కడ ఎక్కువ పబ్లిసిటీ ఖ‌ర్చులు అన‌వ‌స‌ర దండ‌గ వ్య‌వ‌హారం. కాబట్టి కొన్ని సినిమాలు నైజాం విడుదల చేయటం మానేసి కేవ‌లం ఆంధ్రా సీడెడ్ లో విడుదల చేసుకుంటే చిన్న సినిమాకి 4/5 లక్షలు లాభం వస్తుంది. మాట ఎవరూ వినరు కానీ.. చాద‌స్తం కొద్దీ చెబుతున్నా అని ఓ ప్ర‌ముఖ నిర్మాత అన్నారు.