Begin typing your search above and press return to search.
థియేటర్లు తెరుస్తారు సరే.. సినిమాలెక్కడ?
By: Tupaki Desk | 5 Oct 2020 5:20 PM ISTఏడు నెలల నిరీక్షణకు తెరపడబోతోంది. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి రెండో వారంలో మూత పడ్డ థియేటర్లు ఈ నెల 15న తెరుచుకోబోతున్నాయి. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో థియేటర్లను నమ్ముకున్న వాళ్లకు మళ్లీ ప్రాణం లేచి వచ్చింది. థియేటర్ల బూజు దులిపి వాటిని సినిమాల ప్రదర్శన కోసం రెడీ చేస్తున్నారు. ఐతే వీళ్ల ముస్తాబు సరే కానీ.. థియేటర్లలో ప్రదర్శించడానికి సినిమాలెక్కడున్నాయన్నది ప్రశ్న. థియేటర్లు తెరుచుకోబోతున్నట్లు ప్రకటన వచ్చాక రామ్ గోపాల్ వర్మ తన ‘కరోనా వైరస్’ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు తప్పితే.. ఇంకెవ్వరూ అలాంటి అనౌన్స్‌మెంట్లు ఇవ్వలేదు. వర్మ సినిమా మీద జనాల్లో ఏ మేర ఆసక్తి ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లి వర్మ సినిమాను డబ్బులుపెట్టి జనాలు చూస్తారని ఆశించడం అత్యాశే.
నిజానికి ఉప్పెన, రెడ్ సహా కొన్ని సినిమాలు ఫస్ట్ కాపీలతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓటీటీ ఆఫర్లను కూడా కాదని థియేటర్లలోనే వాటిని రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చుని ఉణ్నారు. కానీ వాటిని ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ చేయాలనుకోవట్లేదు. అందుక్కారణం.. కరోనా భయంతో ఉన్న జనాలు థియేటర్లకు వస్తారా అన్న సందేహాలకు తోడు.. 50 శాతం మాత్రమే థియేటర్లను నింపుతున్న నేపథ్యంలో హౌస్ ఫుల్ అయినా ఇంతకుముందు వచ్చే మొత్తంలో సగం రెవెన్యూనే వస్తుంది. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేసి చంపేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు.
కాబట్టి కాస్త పేరున్న సినిమాలేవీ వెంటనే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. చిన్న చిత్రాలను విడుదల చేస్తే ప్రేక్షకులు అసలే థియేటర్లకు రాకపోవచ్చు. పాత సినిమాలను విడుదల చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఓటీటీల్లో నడుస్తున్న కొత్త చిత్రాలను విడుదల చేయాలంటే నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారన్నది చూడాలి. అంతేసి రేటు పెట్టి ఎక్స్‌క్లూజివ్ ఓటీటీ రిలీజ్ కోసం హక్కులు కొన్న ఫ్లాట్‌ఫామ్స్.. థియేటర్లలో వాటిని రిలీజ్ చేయడానికి అంగీకరించి ఉంటాయని అనుకోలేం. ఈ నేపథ్యంలో థియేటర్లను తెరిచినా అది నామమాత్రమే తప్ప.. ఆశించిన స్థాయిలో నడవడం కష్టంగానే కనిపిస్తోంది.