Begin typing your search above and press return to search.

​చిన్న సినిమాలకు సినిమా కష్టాలు

By:  Tupaki Desk   |   22 Jun 2017 5:43 AM GMT
​చిన్న సినిమాలకు సినిమా కష్టాలు
X
సుమారుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో సింగిల్ థియేటర్లు మల్టీప్లెక్స్ లు కలుపుకొని 2,500 స్క్రీన్లు ఉంటాయి. ఇవి కూడా కొన్ని ప్రొడక్షన్ హౌస్ చేతిలో, కొందరి పెద్ద డిస్ట్రిబుటర్స్ చేతిలోనే ఉన్నాయి. తెలుగు సినిమాను కొన్నేళ్ళుగా వేధిస్తున్న సమస్య ఏంటంటే చిన్న సినిమాలుకు అందుబాటులో థియేటర్లు లేకపోవడం. థియేటర్లు లేక కొన్ని చిన్న సినిమాలు విడుదల వాయుదావేసుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. ఇలా జరగడం ఏమి మొదటిసారి కదూ కానీ దీనికి ఒక పరిష్కారం ఇచ్చే దిశగా ఎవరు పాటుపడటం లేదు ఎందుకో.

ఇప్పుడు కూడా కొన్ని పెద్ద సినిమాలు వలన ఆరు చిన్న సినిమాలు ఇరకాటంలో పడ్డాయి. దువ్వాడ జగన్నాధం సినిమా జూన్ 23 న విడుదల అవుతుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో ఉన్న చాలా థియేటర్లు ఈ సినిమాను తీసుకోవడం జరిగింది. ఈ సినిమా విడుదల తరవాత మరో పెద్ద సినిమా నాని ‘నిన్ను కోరి’ జూలై 7 న విడుదల అవుతుంది. అలాగే గోపిచంద్ గౌతమనంద కూడా వెనక్కెళ్ళి దాదాపు అదే డేటు అంటున్నారు. కాబట్టి ఈ ఆరు చిన్న సినిమాలు ఎలా ఎప్పుడు విడుదలైనా ఈ మధ్య గ్యాప్ లోనే విడుదల కావాలి. ఒకవేళ అయిన కూడా ఎక్కువ రోజులు థియేటర్లో ఉంచడం కష్టం. ఈ సినిమాలు థియేటర్లు దొరకడం కూడా గగనమే ఇప్పుడు.

జయదేవ, మాయ మహల్, కథలో రాజకుమారి, వీరు, చందమామ రావే, రెండు రెండ్ల ఆరు.. లాంటి చిన్న సినిమాలు వచ్చే వారం విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరింత క్లిష్ట పరిస్థితి లో విడుదల అవుతున్న ఈ సినిమాలు ఎక్కడ ఆడతాయో ఎలా విడుదల అవుతాయో విడుదలై ఎన్నినాళ్ళు ఉంటాయో చెప్పలేం. రెండు రెండ్ల ఆరు.. కథలో రాజకుమారి సినిమాలకు వారాహి వారి బ్యాకింగ్ ఉంది కాబట్టి ఓకె కాని.. మిగతా సినిమాల సంగతే అర్ధంకాని పరిస్థితి. జయదేవ సినిమా మంత్రిగారి కొడుకే హీరో కాబట్టి ధియేటర్లు దొరికినా దొరకచ్చు. ఇతరులే చూసుకోవాలి.