Begin typing your search above and press return to search.

క‌త్రిన‌తో ఎఫైర్ క‌ట్టు క‌థ అనేసిన యువ‌హీరో

By:  Tupaki Desk   |   18 March 2021 4:30 PM GMT
క‌త్రిన‌తో ఎఫైర్ క‌ట్టు క‌థ అనేసిన యువ‌హీరో
X
ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ కీర్తినార్జించాడు విక్కీ కౌశ‌ల్. ప్రతి ఔత్సాహిక‌ నటుడు కలలు కనే ఆ స్టార్ డమ్ ని కీర్తిని అత‌డు పొందాడు. కాని ఇటీవల ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి - స్టార్ డమ్ అనేవి ఒక `రేటు` అనుకుంటే వెంట ప‌డి వస్తాయని అన‌డం స‌ర్ ప్రైజ్ చేసింది.

ఇక క‌త్రిన‌తో అఫైర్ వార్త‌ల‌పై ప్ర‌శ్నిస్తే.. విక్కీ ఓ రేంజులోనే క్లాస్ తీస్కున్నాడు. అస‌లు వ్యక్తిగత జీవితం బహిరంగ అంశంగా మారినప్పుడు ప్రతిచోటా ప‌బ్లిక్ అయిన‌ప్పుడు అది తన ప్రియమైన వారిని ప్రభావితం చేస్తుందని విక్కీ అన్నారు. అతను తన గురించి అతని జీవితం గురించి ముందే ఓపెన్ గా ఉన్న‌ప్పుడు ఆ తరువాత ఎటువంటి క్రాస్ చెకింగ్ లేకుండా ప్రామాణికత అనేది లేకుండా ప‌త్రిక‌ల్లో వార్త‌లుగా రావ‌డం చూశాన‌ని.. ఇవ‌న్నీ దాదాపు చైనీస్ గుసగుసల ఆటలాంటివ‌ని అన్నారు. అందువల్ల అలాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు మరింత జాగ్రత్త తీసుకున్నాను అని విక్కీ అన్నారు.

క‌త్రిన‌తో స్నేహం చేశాన‌ని కానీ మీడియాలో చిలువ‌లు ప‌లువలుగా ప్ర‌చారం చేశార‌ని విక్కీ అన్నారు. విక్కీ కౌషల్ ప్రస్తుతం తన సూపర్ హీరో చిత్రం `ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ` కోసం సిద్ధమవుతున్నాడు. అతను YRF తో కామెడీ చిత్రం లోనూ న‌టిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ తో ప్లాన్ చేసిన మరొక కామెడీ చిత్రం సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. దీనికి శశాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే `మిస్టర్ లేలే` కావచ్చు. సర్దార్ ఉధమ్ సింగ్ బయోపిక్ .. సామ్ మానేక్షా బయోపిక్ లోనూ అత‌డు న‌టిస్తాడ‌ని క‌థ‌నాలొచ్చాయి.