Begin typing your search above and press return to search.

'నువ్వు నాకు నచ్చావ్' చిత్రాన్ని 72సార్లు చూసిన యువ హీరో..!

By:  Tupaki Desk   |   11 March 2021 2:30 AM GMT
నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని 72సార్లు చూసిన యువ హీరో..!
X
టాలీవుడ్ వర్సటైల్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ రోల్స్ తో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన శ్రీవిష్ణు.. హీరోగా మారి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కులలను అలరిస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ''గాలి సంప‌త్‌'' రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీ విష్ణు.. తాజాగా హాస్యనటుడు హోస్ట్ చేసే ఓ టీవీ టాక్ షోలో మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ కు తాను ఎంత వీరాభిమానో తెలియజేశాడు.

ఈ సందర్భంగా 'నువ్వు ఎక్కుసార్లు చూసిన సినిమా ఏది?' అని శ్రీ విష్ణును అలీ ప్రశ్నించగా.. క్షణం ఆలస్యం చేయకుండా 'నువ్వు నాకు నచ్చావ్' అని విష్ణు సమాధానమిచ్చాడు. వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఆ సినిమాను థియేటర్లలోనే 72 సార్లు చూసినట్లు ఈ టాలెంటెడ్ హీరో వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి పాల్గొన్న శ్రీవిష్ణు.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. లీప్ ఇయర్‌ లో ఫిబ్రవరి 29న పుట్టానని.. అందుకే ప్రతి ఏడాది ఫిబ్రవరి 28న బర్త్ డే ను జరుపుకుంటునట్లు శ్రీవిష్ణు తెలిపారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలావుండగా బ్లాక్ బస్టర్ డెరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో అతని స్నేహితుడు ఎస్‌.కృష్ణ రచయితగా నిర్మాతగా మారి 'గాలి సంపత్' చిత్రాన్ని తెరకెక్కించారు. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ చిత్రానికి అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీవిష్ణుతో పాటు రాజేంద్ర‌ప్ర‌సాద్ కీ రోల్ ప్లే చేసాడు.