Begin typing your search above and press return to search.

యంగ్ బ్యూటీ నిర్మాత‌గాను షేక్ చేస్తోందే!

By:  Tupaki Desk   |   18 Oct 2022 12:30 AM GMT
యంగ్ బ్యూటీ నిర్మాత‌గాను షేక్ చేస్తోందే!
X
'గాడ్సే' చిత్రంతో తెలుగులో లాంచ్ అయిన యంగ్ బ్యూటీ ఐశ్వ‌ర్యా ల‌క్ష్మి సుప‌రిచిత‌మే. తొలి సినిమా అంచ‌నాలు అందుకోన‌ప్ప‌టికీ ఓ ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన పొన్నియ‌న్ సెల్వ‌న్ లో నూ న‌టించింది. ఇందులో పూంగుళలి అనే పాత్రలో మెప్పించింది. ఈ సినిమా స‌క్సెస్ తో అమ్మ‌డికి పాన్ ఇండియా వైడ్ గుర్తింపు ద‌క్కింది.

పైగా ఆ పాత్రకు మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. నేష‌న‌ల్ మీడియాలోనూ బాగానే పాపుల‌ర్ అవుతుంది. పోన్నియ‌న్ కంటే ముందు మాతృభాష‌లో..త‌మిళ్ లో కొన్ని సినిమాలు చేసింది గానీ..అవి అంత‌గా గుర్తింపుస తీసుకురాలేదు. తాజా క్రేజ్ తో బ్యూటీ రెట్టించి ఉత్సాహంలో క‌నిపిస్తుంది. ఈ బ్యూటీ న‌టిగానే నిర్మాత‌గాను బిజీ అవుతోంది. న‌టిగా వ‌చ్చిన సినిమాలు చేస్తూనే నిర్మాత‌గానూ అభిరుచిని చాటుతోంది.

'కుమారి' టైటిల్ తో తమిళ.. మలయాళ భాషల్లో న‌టిస్తూ నిర్మిస్తోంది. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ' ఇది ఒక పురాణ ఇతిహాస జోనర్‌లో రూపొందిన థ్రిల్లర్‌ మూవీ. ఆ సినిమా చూసి అందరూ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. రొటీన్కి భిన్న‌మైన సినిమా. ఇటీవ‌లి కాలంలో కాన్సెప్ట్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ దక్కుతోంది.

ఆ కోవ‌లో మా చిత్రం కూడా నిలుస్తుంద‌ని' తెలిపింది. ఇంకా ఈ బ్యూటీ చేతిలో మ‌రికొన్ని సినిమాలున్నాయి. 'అర్చన 31 నాట్ ఔట్'.. 'గుట్ట కుష్తీ' వంటి సినిమాలు చేస్తోంది. మాలీవుడ్ లో 'క్రిస్టోప‌ర్'..'కింగ్ ఆఫ్ కోత' చిత్రాలు చేస్తోంది. పొన్నియ‌న్ సెల్వ‌న్-2 లో కూడా కంటున్యూ అవుతుంది.

ప్ర‌స్తుతం ఆ సినిమాకి సంబంధించి ప‌నుల్లోనూ అమ్మ‌డు నిమ‌గ్న‌మ‌వుతోంది. ఇలా ఓవైపు న‌టిగా బిజీగా ఉంటూనే..మ‌రోవైపు నిర్మాణ రంగంలోనూ రాణిస్తోంది. అలాగే అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో య‌వ‌త‌ని ఉర్రూత‌లూగిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.