Begin typing your search above and press return to search.

'అవును-2' అసలు కథ బయటపెట్టిన రైటర్.. రవిబాబుతో అలా..?

By:  Tupaki Desk   |   15 May 2021 2:30 AM GMT
అవును-2 అసలు కథ బయటపెట్టిన రైటర్.. రవిబాబుతో అలా..?
X
తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ కం డైరెక్టర్ రవిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక నటుడిగా కెరీర్ ప్రారంభించిన రవిబాబు ప్రస్తుతం దర్శకుడుగా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే రవిబాబు ఏం చేసినా అది ప్రత్యేకంగానే నిలుస్తుంది. యాక్టర్ నుండి డైరెక్టర్ గా మారిన తర్వాత సినిమాలతో ఆయన మార్క్ కామెడీ కూడా నిరూపించుకున్నాడు. డైరెక్టర్ గానే కాదు రవిబాబు వ్యక్తిగతంగా కూడా కామెడీ బాగా పండించగలడని చాలామందికి తెలుసు.

అయితే సినిమాలలో తప్ప రవిబాబు బయట ఎక్కువగా కనిపించడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి వర్క్ చేస్తూ ఉంటాడని టాక్. అయితే లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం దేశమంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఎవరిళ్ళకు వారు పరిమితమై తదుపరి సినిమాల గురించి వర్క్ చేసుకుంటున్నారు. అయితే రవిబాబు చిత్రాలలో ఎక్కువ భాగం థ్రిల్లర్ లేదా హర్రర్ మార్క్ కలిగి ఉంటాయి.

ఆయన తీసిన సినిమాల్లో అవును సినిమా ఒకటి. ఈ సినిమాలో ఇంట్లో నివసించే దెయ్యం కారణంగా ఒక జంట ఎదుర్కొంటున్న సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఈ సినిమా కథను అందరూ ఏదో కొరియన్ సినిమా ఇన్స్పిరేషన్ అనుకున్నారు. కానీ అదేం కాదు స్వయంగా మా ఇంట్లో జరిగిన సంఘటనల ఆధారంగా కథ రాశామని చెప్పారు 'అవును' రైటర్ నివాస్. లేటెస్ట్ ఇంటర్వ్యూలో నివాస్ ఈ సినిమా వెనుక కథ గురించి మాట్లాడాడు.

"నిజానికి 'అవును' లైన్ చెప్పిన తర్వాత డైరెక్టర్ రవిబాబు వెంటనే ఓకే అనేసి స్క్రిప్ట్ రెడీ చేసేయమన్నారు. చేసేసాం సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ ఓ థ్రిల్లర్ లైన్ కావాలంటే మరో లైన్ చెప్పాను. అదే అవును-2. కానీ అవును సీక్వెల్ అనేది సరైన స్టోరీ లేదు. సరైన స్టోరీ లేదు కానీ సీక్వెల్ తీసేద్దాం అని ఫిక్స్ అయిపోయాడు రవిబాబు. కానీ స్టోరీ లేని చీటింగ్ స్క్రీన్ ప్లే ఎప్పుడు హిట్ కాదు.. జనాలకు చేరదు అని క్లియర్ గా చెప్పాను.

కానీ రవి వినలేదు. అవును సీక్వెల్ కు నేను వర్క్ చేయలేదు. రవిబాబు పంతం పట్టి హిట్టు కొడతానని తీసాడు. ఆఖరికి అవును-2 అనే సినిమా జనాలకు గుర్తే లేకుండా పోయింది. నేను ముందే ఊహించాను. చాలాసార్లు చెప్పాను. రవిబాబు వినలేదు. అలాగే ఆవిరి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అందుకే అవును-2, ఆవిరి సినిమాలకు నా పేరు పడలేదు" అని రైటర్ నివాస్ తెలియజేసారు.