Begin typing your search above and press return to search.

బంగార్రాజు పనులు మొదలయ్యాయి

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:40 PM IST
బంగార్రాజు పనులు మొదలయ్యాయి
X
నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. అప్పటి నుండి కూడా బంగార్రాజు సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ కోసం అక్కినేని అభిమానులు చెబుతూనే ఉన్నారు. నాగార్జున బంగార్రాజు చేసేందుకు ఒప్పుకున్నాడు. కాని కథ విషయంలో ఒప్పుకోలేదు. దాంతో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కథ విషయంలో చాలా కాలం పాటు వర్క్‌ చేశాడు. ఎట్టకేలకు కథను పూర్తి చేసిన కళ్యాణ్‌ కృష్ణ త్వరలోనే సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

సోగ్గాడే చిన్ని నాయనో సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించారు. సినిమా సక్సెస్ లో పాటలు కీలక పాత్ర పోషించాయి అనడంలో సందేహం లేదు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. బంగార్రాజు సినిమా షూటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం మరోసారి బంగార్రాజుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సినిమాకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రవీణ్‌ సత్తారు సినిమా తో పాటు బంగార్రాజు సినిమాను నాగార్జున సమాంతరంగా చేస్తాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్కటి అయినా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.