Begin typing your search above and press return to search.

అల వాల్మీకిని చంపాలనుకున్నారట

By:  Tupaki Desk   |   27 Jan 2020 4:39 AM GMT
అల వాల్మీకిని చంపాలనుకున్నారట
X
సినిమాల్లో సీరియల్స్‌ లో విలన్స్‌ గా నటించే వారు బయట కనిపించిన సమయంలో కొందరు మహిళలు భయపడటం లేదంటే అలా ఎందుకు చేశావు.. ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ తిట్టడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లోక జ్ఞానం తక్కువ ఉండే మహిళలు సినిమాలు సీరియల్స్‌ లీనమై పోయి చూసి విలన్స్‌ పై కోపం పెంచుకుంటూ ఉంటారు. కాని ఈమద్య కాలంలో ఇలాంటివి తక్కువ అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇది సినిమా వారు కేవలం నటిస్తున్నారు అంటూ ఆలోచిస్తున్నారు. కాని అల వైకుంఠపురంలో సినిమాలో బంటు తండ్రి పాత్రలో నటించిన వాల్మీకిని ఒక వ్యక్తికి మాత్రం చంపేయాలన్నంత కోపం వచ్చిందట.

తాజాగా ఆ విషయమై వాల్మీకి పాత్ర పోషించిన మురళి శర్మ మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో చిత్రం నా కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా అయ్యింది. గతంలో ప్రతి రోజు గంట పాటు వాకింగ్‌ వెళ్లే వాడిని. ఇప్పుడు 1 గంట 45 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే 45 నిమిషాలు నన్ను అల వైకుంఠపురంలో చూసిన వారు వచ్చి మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సినిమాలో నేను చేసిన ప్రతి సీన్‌ కు సంబంధించి మాట్లాడుతూ నన్ను అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

సినిమాలోని ఇంటర్వెల్‌ ముందు సీన్‌ చూసి నన్ను చంపేయాలన్నంత కోపం వచ్చిందట కొందరికి. ఆ విషయాన్ని స్నేహితులు ఫోన్‌ లు చేసి చెబుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాల్మీకి పాత్రను అంత గొప్పగా మలిచిన దర్శకుడికి నిజంగా హ్యాట్సాఫ్‌. నా పాత్రను అద్బుతంగా డిజైన్‌ చేశాడు కనుక నేను నా శక్తి మేరకు కష్టపడ్డాను. ఆ పాత్రను బాగా వచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేశాను అన్నాడు. వాల్మీకి పాత్ర చాలా నాచురల్‌ గా ఉండటంతో పాటు సినిమాలోనే అత్యంత ఆసక్తికరమైన పాత్రగా ఉంటుంది. ఒక టిపికల్‌ తండ్రి పాత్రలో మురళి శర్మ నటించి మెప్పించాడు. అందుకే ఇప్పుడు ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తుంది.