Begin typing your search above and press return to search.

'ది వారియర్‌' ఎగ్జైటింగ్‌ అనౌన్స్మెంట్‌ అదేనా..!

By:  Tupaki Desk   |   26 March 2022 10:41 AM GMT
ది వారియర్‌ ఎగ్జైటింగ్‌ అనౌన్స్మెంట్‌ అదేనా..!
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ స్టార్‌ మాస్‌ డైరెక్టర్‌ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్‌. ఈ సినిమా పై మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత రామ్ నుండి ఒక సినిమా వచ్చి ప్లాప్‌ అయ్యింది. జనాలు ఆ సినిమా గురించి పెద్దగా పట్టించుకోకుండా.. ఆ ప్లాప్‌ ను పరిగణలోకి తీసుకోకుండి ది వారియర్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా లో ఉప్పెన బేబమ్మ నటించడం వల్ల కూడా ఆసక్తి అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు కృతి శెట్టి నటించి విడుదల అయిన సినిమా లు ఉప్పెన తో మొదలుకుని బంగార్రాజు మరియు శ్యామ్‌ సింగరాయ్ మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈమె లక్‌ ఖచ్చితంగా రామ్‌ కు వస్తుందని.. తద్వారా ది వారియర్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు కొద్ది సమయం క్రితం రేపు ఉదయం 9.46 గంటలకు ఒక ఎగ్జైటింగ్‌ ప్రకటన చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ ప్రకటన కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసి అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నారు. రామ్‌ అభిమానులతో పాటు మీడియా సర్కిల్స్ లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ ఎగ్జైటింగ్ ప్రకటన ఏమై ఉంటుందా అంటూ చర్చలు జరుపుకుంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ది వారియర్ సినిమా విడుదల తేదీని రేపు ఉదయం ప్రకటిస్తారని తెలుస్తోంది. విడుదల తేదీ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయాన్ని తీసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ తేదీని అధికారికంగా ప్రకటించడం ద్వారా సినిమా పై జనాల్లో మరింతగా ఆసక్తిని పెంచే అవకాశం ఉందని చిత్ర దర్శకుడు లింగు స్వామి మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారట.

ది వారియర్ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్ పోస్టర్ మరియు గ్లిమ్స్ అన్ని కలిపి సినిమా పై అంచనాలు భారీగా పెరిగేలా చేశాయి అనడంలో సందేహం లేదు. అంచనాలకు తగ్గట్లుగా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో లింగు స్వామి ఈ సినిమాను చేస్తున్నట్లుగా అంతా చాలా నమ్మకంతో ఉన్నారు. రామ్‌ ఈ కథ కోసం చాలా నెలలు వెయిట్‌ చేసి చివరకు లింగు స్వామికి ఓకే చెప్పాడు అనేది టాక్.

ఇక దర్శకుడు లింగు స్వామి విషయానికి వస్తే ది వారియర్‌ సినిమా కు ముందు తెలుగు లో ఈయన సినిమా చేయాల్సి ఉంది.. అది కూడా అల్లు అర్జున్‌ తో, కాని కొన్ని కారణాల వల్ల సినిమాను చేయలేక పోయాడు. తమిళంలో ఈయన తెరకెక్కించిన సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యి తెలుగు లో డబ్‌ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే అదంతా గతం.. ఈమద్య కాస్త డల్‌ గా ఉన్నాడు. మరి ది వారియర్‌ తో లింగు స్వామి సెట్‌ అయ్యేనా అనేది చూడాలి.