Begin typing your search above and press return to search.

ది వారియర్‌.. ఈ దూకుడు బాక్సాఫీస్‌ వద్ద ఉంటే బాగుండేది

By:  Tupaki Desk   |   30 July 2022 12:30 AM GMT
ది వారియర్‌.. ఈ దూకుడు బాక్సాఫీస్‌ వద్ద ఉంటే బాగుండేది
X
ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన చిత్రం ది వారియర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొక్క బోర్లా పడింది. యాబై కోట్లకు పైగానే ఈ సినిమా కు ఖర్చు చేశారని.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే అయ్యిందంటూ విడుదలకు ముందు లెక్కలతో మతులు పోగొట్టినంత పని చేశారు.

విడుదల తర్వాత వచ్చిన కలెక్షన్స్ కు యూనిట్‌ సభ్యుల మతులు పోయి ఉంటాయి అది వేరే విషయం. ఇంత విచారకర సమయంలో కూడా వారికి ఒక విషయం ఆనందం కలిగించే విధంగా ఉంది. అదే బుల్లెట్‌ బండి. సినిమా విడుదల అవ్వక ముందు నుంచే ఈ పాట తెగ హడావిడి చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది. ఈ పాటకు ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒక మిలియన్ లైక్స్ కూడా దక్కించుకుంది.

యూట్యూబ్‌ లో బుల్లెట్‌ సాంగ్ ను తెగ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. కేవలం ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్‌ ఛానల్‌ లో వంద మిలియన్ల మంది చూసి ఉంటే.. ఇతర ప్లాట్‌ ఫామ్స్ పై చూసిన వారు.. వింటున్న వారు ఎంత మందో అర్థం చేసుకోవచ్చు. బుల్లెట్‌ సాంగ్ సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్‌ లో లక్షల్లో రీల్స్ గా వచ్చిన విషయం కూడా తెలిసిందే.

ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ లో కనీసం 25 శాతం సినిమా కి వచ్చి ఉంటే వసూళ్లు భారీగా ఉండేవి.. బయ్యర్లకు మరియు నిర్మాతలకు ఈ బాధలు ఉండేవి కాదు అనేది సోషల్‌ మీడియా టాక్‌. యూట్యూబ్‌ లో బుల్లెట్ పాట దూకుడు చూపించినట్లుగా ది వారియర్ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపించి ఉంటే వసూళ్లు రికార్డు స్థాయి లో ఉండేవని రామ్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

రామ్‌ మరియు కృతి శెట్టిల యొక్క డాన్స్ కు మరియు వారి యొక్క స్టైల్‌ కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. కృతి శెట్టి కి ఈ సినిమా ప్లాప్ అయినా కూడా బుల్లెట్ సాంగ్ ఒక్కటి ఆమె స్టార్‌ డమ్‌ ను మరింతగా పెంచేందుకు ఉపయోగపడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వయసులో చిన్నే అయినా కూడా కృతి వేసిన డాన్స్ స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అందుకే ఈ స్థాయి వ్యూస్‌ వస్తున్నాయని అంటున్నారు. దూకుడు చూస్తూ ఉంటే ఈ పాట ముందు ముందు మరిన్ని వందల మిలియన్‌ ల వ్యూస్ ను దక్కించుకున్న ఆశ్చర్యం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.